గతంతో పోలిస్తే ఈ దఫా తెలంగాణ ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎక్కువగా కనిపించింది! నగదు ప్రవాహం విపరీతంగా పెరిగింది!! కోట్ల రూపాయల డబ్బు పట్టుబడింది. పట్టుబడిన సొమ్ముతో పోలిస్తే వందల రెట్ల డబ్బు చేతులు మారింది. దాదాపు అన్ని పార్టీల అభ్యర్థులు ఓట్ల కోసం నోట్లు పంచారని ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర విషయం ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే.. టాలీవుడ్ లో కొందరు సెలబ్రిటీల నుంచి ప్రజా కూటమికి భారీగా డబ్బులు అందాయట. ఆ సొమ్ముతోనే కూటమి నేతలు ప్రచార పర్వం - ఓటర్లకు డబ్బుల పంపిణీ వంటివి చేశారట.
నిజానికి తెలంగాణలో ఈ ఎన్నికలు కేసీఆర్ కనుసన్నల్లో జరిగాయని విశ్లేషకులు చెబుతుంటారు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే విషయం ఆయన ఒక్కరికే ముందుగా తెలుసు. అందుకే ఆ లోపే 105 స్థానాల్లో టీఆర్ ఎస్ అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. వాళ్లకు స్పష్టమైన సంకేతాలు అందాయి. అవసరమైన డబ్బు కూడా అగ్ర నాయకత్వం నుంచి వారికి ముందే అందిందన్నది కొందరి వాదన.
అసెంబ్లీ రద్దు గురించి తెలియదు కాబట్టి కాంగ్రెస్ కాస్త ఆలస్యంగా మేల్కొంది. టీడీపీ - సీపీఐ - టీజేఎస్ లతో కలిసి ప్రజా కూటమి ఆవిర్భావం ఖరారవ్వడానికీ సమయం పట్టింది. పొత్తు ఖరారయ్యాక కూటమి నేతలకు చంద్రబాబు నుంచి భారీగా డబ్బు అందించారని ప్రచారం జరిగింది. కూటమి తరఫున మీడియాలో ప్రచారానికే బాబు రూ.200 కోట్లు పక్కనపెట్టారని కూడా కథనాలు వినపడ్డాయి.
అయితే - ఆంధ్రాలో డబ్బు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఎన్నికలకు ముందు టీఆర్ ఎస్ చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలతో ఆ డబ్బును తెలంగాణకు తీసుకురావడం చంద్రబాబుకు కష్టంగా మారిందట. ఐటీ సోదాలు - పోలీసుల నిఘా కారణంగా అనుకున్న సమయంలో డబ్బును తెలంగాణకు చేర్చలేకపోయారట. మీడియాలో ఆ మధ్య ఇలా చాలానే కథనాలు వచ్చాయి. ఇక్కడే ఓ ఆసక్తికర విషయంపై తాజాగా ప్రచారం జరుగుతోంది. ఆంధ్రా నుంచి డబ్బు తరలింపు కష్టం కావడంతో.. టాలీవుడ్ లోని కమ్మ సామాజిక వర్గానికి చెందని కొందరు సెలబ్రిటీలు తమ సన్నిహితుడైన చంద్రబాబు కోసం ఇక్కడే డబ్బులు అరేంజ్ చేశారట. ఆ డబ్బే ప్రజా కూటమి నేతలకు వెళ్లిందట. ఎన్నికల హాడావుడి ముగిసి.. పోలీసు నిఘా తగ్గాక సదరు సెలబ్రిటీలకు చంద్రబాబు తిరిగి డబ్బు ఇచ్చేయనున్నారట. ఇందులో నిజమెంతుందో తెలియదు గానీ.. చంద్రబాబు కోసం అలా చేసే సెలబ్రిటీలు హైదరాబాద్ లో తక్కువేమీ కాదులే అని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.