మరో ఏడాది లోపే ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం మెల్లగా వేడెక్కుతోంది. పార్టీలు ఇప్పటి నుంచే ప్రణాళిక వేసుకునే దిశగా పావులు కదుపుతున్నాయి. పాలిటిక్స్ కు సినిమా ఇండస్ట్రీకున్న సంబంధం పైకి కనిపించినా కనిపించకపోయినా ఒకదాని మీద మరొకటి ప్రభావం చూపడం ముందు నుంచీ జరుగుతున్నదే. అందుకే ప్రచారం కోసం స్టార్లను వాడుకోవడం కోసం పార్టీలు అన్ని రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ లాంటి అశేష అభిమానులు ఉన్న హీరోలు నేరుగా పార్టీలు పెట్టి రాజకీయంగా కదం తొక్కాలని ప్రయత్నిస్తున్న తరుణంలో అధికారంలో ఉన్న పార్టీలు సినిమా తారల వైపు దృష్టి సారిస్తున్నారు. పబ్లిక్ లో తమ ఇమేజ్ తో ప్రభావితం చేసేది వీళ్ళే కనక రానున్న రోజుల్లో వాళ్ళను వాడుకునే దిశగా ప్రయత్నాలు వేగవంతమయ్యాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణ ప్రభుత్వ అధికార పార్టీ టిఆర్ ఎస్ దీనికి సంబంధించిన విషయంలో ముందడుగు వేసినట్టు సమాచారం. ప్రత్యేకంగా ఒక మేనేజర్ ను పిలిపించి అతని ద్వారా సినిమా తారలను తమ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసేందుకు ఒప్పించేలా డీల్ కోసం పిలిపించినట్టుగా వినికిడి. అక్కడి వర్గాలు ఔననే అంటున్నాయి. కాకపోతే స్టార్స్ ఎవరు వస్తారు అనేదాని గురించి మాత్రం గుట్టు బయట పెట్టడం లేదు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులను టార్గెట్ చేసుకుని తారలను వాడుకోవాలని చూస్తున్నారట. మరి ఆ మేనేజర్ ఎవరెవరిని ఒప్పిస్తాడు ఎవరు ప్రచారానికి వస్తారు అనే లెక్కలు ప్రస్తుతానికి ఊహాగానాలే. ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టిన కాలం నుంచి ఏదో రకంగా సినిమా తారలు రాజకీయాల్లో ప్రభావం చూపుతూనే ఉన్నారు. కాకపోతే ఈసారి పవన్ కళ్యాణ్ కమల్ హాసన్ రజనీకాంత్ లాంటి స్టార్లు ఒకేసారి స్వంత పార్టీలు పెట్టడమే విశేషం. తెలంగాణలో టిఆర్ ఎస్ కు సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదు అనే ఉద్దేశంతో ఈ స్ట్రాటజీ ప్లాన్ చేసినట్టుగా సమాచారం. చూద్దాం ఇది ఎంత వరకు కార్యాచరణలోకి వస్తుందో.