టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో కీలక మలుపు.. తెలంగాణ సర్కార్ కు షాక్

Update: 2022-03-24 05:36 GMT
తెలంగాణలో డ్రగ్స్ కేసులు ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ ను ఎంత షేక్ చేశాయో తెలిసిందే.. చాలా మంది సినీ,రాజకీయ ప్రముఖులు ఇందులో ఆరోపణలు ఎదుర్కొన్నారు.  ఈ క్రమంలోనే తర్వాత కేసీఆర్ సర్కార్ డ్రగ్స్ కేసును నీరుగార్చిందన్న అపవాదును తెచ్చుకుంది.

డ్రగ్స్ కేసులు కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి పిల్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. డ్రగ్స్ కేసులపై హైకోర్టుకు ఎక్సైజ్‌శాఖ నివేదిక సమర్పించింది. డ్రగ్స్ కేసులను దర్యాప్తు చేసే అధికారం కేంద్ర సంస్థలతో పాటు తమకూ ఉందని ఎక్సైజ్ శాఖ తెలిపింది.అయితే ఈ కేసులో ఈడీ ఇన్ వాల్వ్ అయ్యి తెలంగాణ ప్రభుత్వం నుంచి డేటా కావాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఈడీ కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసింది. కేసుకు సంబంధించిన డిజిటల్ డేటా ఇవ్వడం లేదంటూ సీఎస్ సోమేష్ కుమార్, అబ్కారీ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై ఈడీ పిటీషన్ దాఖలు చేసింది.  కోర్టు ధిక్కరణ కింద సోమేష్ కుమార్, సర్ఫరాజ్ అహ్మద్ ను శిక్షించడంతోపాటు గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈడీ కోరింది.

ఈనెల 13న సోమేశ్ కుమార్,సర్ఫరాజ్ అహ్మద్ లకు న్యాయవాది తర్వాత నోటీసులు పంపించినట్లు తెలిపింది. ఈ పిటీషన్ పై త్వరలోనే విచారణ జరుగనుంది.

టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ కోరిన వివరాలు ఇవ్వాలని ఫిబ్రవరి 2న ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది.

హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పేర్లను పేర్కొంటూ హైకోర్టులో ఈడీ పిటీషన్ దాఖలు చేసింది. వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని ఈడీ పేర్కొంది. వారిద్దరిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది.
Tags:    

Similar News