డ్రగ్స్ కేసులో నిర్మాత, అసిస్టెంట్ డైరక్టర్!

Update: 2016-10-23 05:51 GMT
గతంలో చాలా సార్లు డ్రగ్స్ కేసులో సినిమావాళ్ళు ఇరుక్కోవటంపై చాలా సంఘటనలే జరిగాయి. డ్రగ్స్ కు - సినిమా వాళ్లకు ఆస్థాయిలో సంబందాలు ఉన్నాయని కథనాలు వస్తూ ఉండేవి! అయితే తాజాగా మరోసారి సినిమాలకు చెందిన వ్యక్తులు డ్రగ్స్ కేసులో బుక్కయ్యారు. వారివద్ద నున్న సంచిలో సుమారూ 1.30 కిలోల మాదక ద్రవ్యాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

వివరాళ్లోకి వస్తే... వాహన తనిఖీలలో భాగంగా జీడిమెట్ల పోలీసులు మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. కుత్బుల్లాపూర్‌ కూడలి మీదుగా సురేష్‌ - కిషోర్‌ అనే ఇద్దరు వ్యక్తులు టూవీలర్ పై ఓ సంచితో అనుమానాస్పదంగా వెళ్తుండటంతో అడ్డగించిన పోలీసులు వారిని తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో వారి వద్ద ఉన్న సంచిలో 1.30 కిలోల డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3 కోట్లని పోలీసులు చెబుతున్నారు. నిందితుల్లో ఒకరు ఓ సినిమా తీసి చేతులు కాల్చుకున్న వ్యక్తి కాగా, మరొకరు అసిస్టెంట్ డైరెక్టర్ కావడం గమనార్హం.

వీరిలో నెల్లూరుకు చెందిన వెంకట సురేష్ అనే వ్యక్తి - యూసుఫ్‌ గూడకు చెందిన కిషోర్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ కలిసి విద్యార్థులకు డ్రగ్స్ అమ్మడానికి ప్రయత్నించారట. ఇదే సమయంలో ఈ  నిందితులు ఇచ్చిన సమాచారంతో నెల్లూరు జిల్లాలో మరోవ్యక్తిని అరెస్టుచేసి - అతడి వద్ద నుంచి కిలోన్నర కిటామైన్‌ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటి మొత్తం డ్రగ్స్ విలువ రూ. 6 కోట్లని అంచనా వేస్తున్నారు. వీరివద్దనున్న డ్రగ్స్ లో కొకైన్ గ్రాము ధర 5-10 వేల వరకు అమ్ముడవుతుందని తెలుస్తోంది. కాగా, సైబరాబాద్ పరిధిలో ఇది రెండో అతిపెద్ద డ్రగ్స్ కేసు అని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ కేసులో దొరికినవారిలో కిషోర్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ఇంతకుముందు రాంగోపాల్ వర్మ సినిమాకి పని చేసినట్లు చెబుతున్నారు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News