ఒకపుడు విశాఖ అందాలు వెండి తెరను వెల్లువలా ముంచెత్తాయి. డెబ్బై దశకం చివరి నుంచి రెండు దశాబ్దాల పాటు ఏ సినిమా షూటింగ్ జరిగినా అది విశాఖలోనే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. విశాఖలోని ప్రకృతి అందాలు, వాటితో పాటు, చక్కని రమణీయత ఇవన్నీ సిల్వర్ స్క్రీన్ మీద అందంగా మెరిసేవి. ప్రఖ్యాత కోలీవుడ్ డైరెక్టర్ కె బాలచందర్ మరో చరిత్ర మూవీతో విశాఖ చరిత్రను మలుపు తిప్పారు. విశాఖ అందాలను పూర్తిగా నాటి బ్లాక్ అండ్ వైట్ మూవీలో చూపించారు.
దాంతో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అది లగాయితూ తెలుగు తమిళ్, కన్నడ, హిందీ సినిమాలు ఏవి షూటింగ్ జరుపుకోవాలన్నా విశాఖ ది బెస్ట్ అన్నట్లుగా మారింది. కొన్ని వందల సినిమాలలో విశాఖ అందాలు కనిపించి కనువిందు చేశాయి. అయితే గత కొంతకాలంగా టాలీవుడ్ సహా ఇతర పరిశ్రమలు అన్నీ కూడా షూటింగ్ అంటే విదేశాలకే వెళ్ళే పరిస్థితి ఉంది. దాంతో విశాఖ ఊసు మెల్లగా అందరూ మరచిపోయారు అనే విమర్శ ఉంది.
ఇక విభజన తరువాత టాలీవుడ్ లో కొంత భాగమైనా విశాఖకు షిఫ్ట్ అవుతుందని అందరూ భావించేవారు. ఎందుకంటే టాలీవుడ్ లో ఉన్న అత్యధిక సినీ జనం అంతా ఆంధ్రా వాళ్ళే కావడంతో ఈ వైపుగా వస్తారని అంచనా వేశారు. అయితే ఆ విధంగా అసలు జరగలేదు, విశాఖను సినీ రాజధానిగా మారుద్దామని వైఎస్సార్ హయాంలోనూ, చంద్రబాబు జమానాలోనూ చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా పెద్దగా ఫలించలేదు. చంద్రబాబు పిలుపు మేరకు ప్రముఖ నిర్మాత డి రామానాయుడు భీమిలీలో స్టూడియో కట్టారు.
ఇక ప్రస్తుత జగన్ ప్రభుత్వం కూడా విశాఖకు టాలీవుడ్ కార్యకలాపాలను విస్తరించాలని భావించింది. ఈ మేరకు ఏణ్ణర్ధం క్రితం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో సినీ ప్రముఖులతో చర్చలు కూడా జరిగాయి. విశాఖలో స్టూడియోల నిర్మాణానికి కూడా ప్రభుత్వం సహకరిస్తుందని కూడా చెప్పుకున్నారు. మొత్తానికి ఏది ఏమైనా టాలీవుడ్ యాక్టివిటీ మాత్రం ఏపీలో పెద్దగా పెరగలేదు
ఈ సమయంలో బెల్లంకొండ సురేష్ తన కుమారుడ్ శ్రీనివాస్ తో చంద్రపతి హిందీ రీ మేక్ ని తీస్తున్నారు. ఆ చిత్రం షూటింగ్ కొంతభాగం విశాఖ జిల్లా భీమిలీలో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు వీవీ వినాయక్ మంత్రి అవంతి శ్రీనివాస్ భేటీ అయ్యారు. విశాఖలో షూటింగులు జరుపుకోవాలని ప్రభుత్వం సహకరిస్తుందని ఈ సందర్భంగా మంత్రి తెలుగు సినీ పరిశ్రమకు మరో మారు అప్పీల్ చేశారు విశాఖలో అన్ని రకాలుగా ప్రకృతి రమణీయతతో పాటు చక్కనైన వాతావరణం ఉందని ఆయన పేర్కొన్నారు. విశాఖను మరచిపోవద్దని కూడా మంత్రి కోరడం విశేషం. మొత్తానికి టాలీవుడ్ విశాఖకు షిఫ్ట్ అవుతుందా, విశాఖకు టాలీవుడ్ హీరోయిన్ చాన్స్ ఇస్తుందా అంటే కాలమే జవాబు చెప్పాలి.