బంగారం వర్షం పడటం ఏంటి? అందులోనూ విమానాశ్రయంలో మాత్రమే ఏంటి అనేది మీ సందేహమే. అయితే ఈ ఆసక్తికరమైన సంఘటన తెలుసుకోవాల్సిందే. రష్యాలో బంగారం వాన కురిసింది. విమానం నుంచి బంగారు కడ్డీలు కుప్పలు కుప్పలుగా కిందకు పడ్డాయి. దాదాపు 3.4టన్నుల బంగారం(3,400కిలోలు) రన్ వేపై పడిపోయింది. దీంతో అధికారులు ఆ బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు.
రష్యాలోని టాస్ వార్తాసంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. నింబూస్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఏఎన్-12 సరుకు రవాణా విమానం గురువారం యాకుత్స్ నుంచి క్రాస్నోయార్క్స్‌కు బయలుదేరింది. అందులో 9.3 టన్నుల బంగారం(9,300కిలోలు) - ఇతర లోహాలు ఉన్నాయి. అయితే విమానం యాకుత్స్ నుంచి గాలిలోకి ఎగరగానే దాని తలుపు తెరుచుకుంది. దీంతో 172 బంగారు కడ్డీలు రన్ వేపై పడిపోయాయి. వాటి బరువు దాదాపు 3.4 టన్నులు ఉంటుంది. వెంటనే విమానాశ్రయ అధికారులు ఆ కడ్డీలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. బంగారంతో నిండిపోయిన రన్ వే దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.