బ్యాంకుల‌కు టోక‌రా: రూ.1.47 ల‌క్ష‌ల కోట్లు ఎగ్గొట్టారు!!

Update: 2020-07-19 11:30 GMT
బ్యాంకుల‌కు ఎగ‌వేత‌దారులే తీవ్ర త‌ల‌నొప్పిగా మారింది. ఆ బ్యాంకుల‌కు వారే తీర‌ని న‌ష్టం చేస్తున్నారు. పెద్ద పెద్ద పారిశ్రామిక‌వేత్త‌ల‌తో పాటు సంప‌న్నులు కూడా బ్యాంకుల‌కు టోక‌రా పెడుతున్నారు. ఆ విధంగా బ్యాంకుల‌కు కోట్ల‌కు కోట్లు ఎగ్గొట్టి ద‌ర్జాగా ఉంటున్నారు. ఆ విధంగా భారత్‌లోని 2,426 మంది/కంపెనీలు ఉద్దేశ‌పూర్వక ఎగవేతదారులు 17 ప్రభుత్వరంగ బ్యాంకులకు ఎగ్గొట్టారని బ్యాంకు అధికారులు ప్ర‌క‌టించారు. ఏకంగా మొత్తం రూ.1.47 లక్షల కోట్లు ఎగవేసినట్లు అఖిల భార‌తీయ బ్యాంక్ ఉద్యోగుల సంఘం (AIBEA) ప్ర‌క‌టించింది. వీరిలో టాప్ 33 ఉద్దేశ‌పూర్వక ఎగవేతదారులు ఒక్కొక్కరు రూ.500 కోట్లు అంతకుమించి ఎగవేసినట్లు వెల్ల‌డించింది. వీరి నుంచి బ్యాంకులకు రావాల్సింది రూ.32,737 కోట్లు అని తెలిపింది. రూ.200 కోట్లకు పైగా ఎగవేసిన కంపెనీలు 147 ఉన్నాయి. వీరు బాకీపడిన మొత్తం రూ.67,609 కోట్లకు పైగా ఉంది. బ్యాంకులను జాతీయం చేసి 51 ఏళ్లు పూర్తయిన సందర్భంగా AIBEA ఈ జాబితాను విడుదల చేసింది. టాప్ 10 డిఫాల్టర్స్ ఎగవేసిన మొత్తం రూ.17,005 కోట్ల వరకు ఉంది. తర్వాత 10 డిఫాల్టర్స్ ఎగవేసిన మొత్తం రూ.7,768 కోట్లు - ఆ తర్వాత 13 మంది ఎకవేసిన మొత్తం రూ.7,964 కోట్లుగా ఉంది. మొత్తం ఈ 33 మంది ఎగవేసిన మొత్తం రూ.32 వేల కోట్లకు పైగా ఉంది.

బ్యాంకుల‌కు ఎగ‌వేస్తున్న వారిలో మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలీ జెమ్స్ - జతిన్ మెహతా విన్‌ సమ్ డైమెండ్స్ ముందంజ‌లో ఉన్నాయి. వారితో పాటు ఏబీజీ షిప్ యార్డ్స్ - రీ ఆగ్రో - రుచి సోయా కూడా కోట్ల‌కు కోట్లు బ్యాంకుల‌కు ఎగ్గొట్టార‌ని ఆ సంఘం తెలిపింది. రూ.4,644 కోట్ల మొత్తంతో గీతాంజలీ జెమ్స్ ఓనర్ మెహుల్ చోక్సీ అతిపెద్ద రుణ ఎగ‌వేత‌దారుడిగా నిలిచాడు. ఆ రుణం పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తీసుకున్నాడు. ఈ విధంగా ఎగ్గొడుతున్న వారి వివ‌రాలు ప్ర‌క‌టించారు. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి..

- జతిన్ మెహతా విన్‌ సమ్ డైమెంట్స్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1,390 కోట్లు.. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.984 కోట్లు.. కెనరా బ్యాంకు నుంచి రూ.636 కోట్లు తీసుకుంది.

- ఏబీజీ షిప్ యార్డ్: ఎస్బీఐ రూ.1,875 కోట్లు

- రుచి సోయా ఇండస్ట్రీస్ ఎస్బీఐ నుంచి రూ.1,618 కోట్లు

- కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఎస్బీఐ నుంచి రూ.586 కోట్లు తీసుకుంది.

ఈ ఎగవేతలతో నష్టపోయిన బ్యాంకుల్లో ఎస్బీఐ మొదటి స్థానంలో ఉంది. ఎస్బీఐకి రూ.685 కంపెనీలు రూ.43,887 కోట్లు ఎగ్గొట్టాయి. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకు - బ్యాంక్ ఆఫ్ బరోడా - సెంట్రల్ బ్యాంకులు ఉన్నాయి.

- ఎస్‌ బీఐకి 685 మంది రూ.43,887 కోట్లు

- పంజాబ్ నేషనల్ బ్యాంక్‌‌ కు 325 మంది రూ.22,370 కోట్లు

- బ్యాంక్ ఆఫ్ బరోడాకు 355 మంది రూ.14,661 కోట్లు

- బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 184 మంది 11,250 కోట్లు

- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 69 మంది రూ.9,663 కోట్లు

- యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 128 మంది రూ.7,028 కోట్లు

- యుకో బ్యాంక్‌ కు 87 మంది రూ.6,813 కోట్లు

- ఓబీసీ బ్యాంకుకు 138 మంది రూ.6,549 కోట్లు

- కెనరా బ్యాంకుకు 96 మంది రూ.5,276 కోట్లు

- ఆంధ్రా బ్యాంకుకు 84 మంది రూ.5,165 కోట్లు

- అలహాబాద్ బ్యాంకుకు 57 మంది రూ.4,339 కోట్లు

- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు 49 మంది రూ.3,188 కోట్లు

- కార్పొరేషన్ బ్యాంకుకు 58 మంది రూ.2,450 కోట్లు

- ఇండియన్ బ్యాంకుకు 27 మంది రూ.1,613 కోట్లు

- సిండికేట్ బ్యాంకుకు 36 మంది రూ.1,438 కోట్లు

- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు 42 మంది రూ.1,405 కోట్లు

- పంజాబ్ అండ్ సింద్ బ్యాంకుకు 6 గురు రూ.255 కోట్లు

బ్యాంకులకు ఉద్దేశ‌పూర్వక ఎగవేతదారుల్లోని టాప్ 10లో వరుసగా...

గీతాంజలి జెమ్స్ రూ.4,644 కోట్లు

విన్సమ్ డైమెండ్స్ అండ్ జ్యువెల్లరీ రూ.2,918 కోట్లు

ఆర్ ఈఐ ఆగ్రో రూ.2,423 కోట్లు

ఏబీజీ షిప్ యార్డ్ రూ.1,875 కోట్లు

కుదోస్ కెమి రూ.1,810 కోట్లు

రుచి సోయా రూ.1,618 కోట్లు

జిల్లి ఇండియా రూ.1,447 కోట్లు

నక్షత్ర బ్రాండ్స్ రూ.1,109 కోట్లు

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రూ.586 కోట్లు

ఈ ఎగ‌వేత‌దారుల్లో తెలుగు రాష్ట్రాల కంపెనీలు ఉన్నాయి. బ్యాంకులకు బాకీపడిన మొత్తాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన కోస్టల్ ప్రాజెక్ట్స్ - బీఎస్ లిమిటెడ్ - ట్రాన్స్‌ ట్రాయ్ - ఇందు - దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ - లియో మెరిడియన్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్‌ - ఎక్సెల్ ఎనర్జీ లిమిటెడ్ - ఐసీఎస్ ఏ - టోటెమ్ ఇన్ ఫ్రా ఉన్నాయి. ఈ కంపెనీలు రూ.58 కోట్ల నుంచి రూ.984 కోట్ల వరకు వివిధ బ్యాంకులకు బాకీ పడ్డాయి.


Tags:    

Similar News