దేశంలోని టాప్ 10 పోలీస్ స్టేషన్స్ ఇవే .. !

Update: 2019-12-07 04:48 GMT
ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి..వాడు పోలీసోడు అయ్యుండాలి అన్నట్టు పోలీసులని వారి డ్యూటీలని సరిగ్గా నిర్వహించుకునేలా చేస్తే .. ఈ సమాజం లో ఎటువంటి దారుణాలు జరగవు. ఎండకి , వానకి అదరక నిరంతరం ప్రజల రక్షణే లక్ష్యంగా విధి నిర్వహణ లో ప్రాణాలని కూడా అర్పించడానికి సిద్ధంగా ఉంటారు పోలీసులు. కానీ , మన దేశంలోని పోలీస్ స్టేషన్స్ లో కూడా రాజకీయ నాయకుల మాటలే చెల్లుబాటు అవుతాయి. దీనితో నిజమైన పోలీసులు కూడా రాజకీయ నాయకుల చేతుల్లో పడి.. ఏమి చేయలేక వారు చెప్పిందే చేస్తున్నారు. ఇకపోతే ఒకవైపు రాజకీయ నాయకుల మాటలు వింటూనే ..మరోవైపు వారి పని వారు చేసుకొని పోయే పోలీసులు కూడా కొంతమంది ఉన్నారు. ఇక్కడ పోలీసులందరు చెడ్డ వారు కారు అన్న విషయం మరచి పోకూడదు. పోలీసులు సమర్ధంగా విధులు నిర్వర్తిస్తున్నా.. నేరస్తులు మాత్రం రెచ్చి పోతున్నారు. నిర్భయ లాంటి కఠిన చట్టాలు వున్నా నిందితులు స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. అలాగే అక్కడక్కడా కొంతమంది చీడ పురుగుల్లాంటి ఆఫీసర్స్ తో మొత్తం పోలీసులులంటేనే ప్రజలకి ఒక రకమైన ఆగ్రహం ఏర్పడింది.

ఇక పోతే తాజాగా కేంద్రం దేశ వ్యాప్తం గా సమర్థవంతంగా పరిపాలన సాగిస్తోన్న పోలీస్ స్టేషన్లకు ర్యాంకులు ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన టాప్ ర్యాంకులో తెలుగు రాష్ట్రాల నుండి ఒకే ఒక పోలీస్ స్టేషన్ చోటు సంపాదించుకోగలిగింది. ఆ స్టేషన్ ఏది అంటే ..తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి పోలీస్ స్టేషన్ అత్యుత్తమంగా పని తీరు కొనసాగిస్తుంది అని తెలిపింది. ఈ చొప్పదండి పీఎస్ 8వ స్థానం లో నిలిచింది. ఇక టాప్ టెన్ లో ఏపీ నుండి ఒక్క పీఎస్ కూడా చోటు సంపాదించలేకపోయింది. ఇక పోతే కేంద్రం ప్రకటించిన తాజా ర్యాంకుల్లో మొదటి స్థానం లో అండమాన్ నికోబార్ దీవుల్లోని అబెర్ దీన్ పోలీస్ స్టేషన్‌ నిలిచింది. అలాగే పదో స్థానంలో మధ్యప్రదేశ్ లో భార్గవ పీఎస్ నిలిచింది. ఆస్తి తగాదాలు, మహిళలు.. అణగారిన వర్గాలపై నేరాల సంఖ్య ఆధారంగా ఈ జాబితాను ప్రకటించారు.

దేశంలోని టాప్ 10 పోలీస్ స్టేషన్స్ :

1. అండమాన్ నికోబార్ – అబెర్ దీన్
2. గుజరాత్ – బాలసినోర్
3. మధ్య ప్రదేశ్ – ఏజీకే బుర్‌హాన్పూర్
4. తమిళనాడు – ఏడబ్ల్యూపీఎస్ తేని
5. అరుణాచల్ ప్రదేశ్ – అనిని
6. ఢిల్లీ – బాబా హరిదాస్ నగర్, ద్వారకా
7. రాజస్థాన్ – బాకనీ
8. తెలంగాణ – చొప్పదండి
9. గోవా – బిచోలిమ్
10. మధ్యప్రదేశ్ – భార్గవ


Tags:    

Similar News