ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలన్నంతనే గుర్తుకు వచ్చే దేశాలు అమెరికా..చైనా.. రష్యా పేర్లు. ఆర్థికంగా కాకున్నా.. ఆయుధ పరంగా.. శాస్త్ర సాంకేతిక అంశాల్లో ఆయా దేశాల తర్వాతే మిగిలిన దేశాలు. మరి.. సంపన్నదేశాలు అన్నంతనే కొందరు అమెరికా.. చైనా పేర్లు చెబుతుంటారు. కానీ.. అది తప్పన్న విషయం చాలా మందికి తెలీదు. శక్తివంతమైన దేశాలు వేరు.. సంపన్న దేశాలు వేరు. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ ఫైనాన్షియల్ మ్యాగజైన్ గా పేరున్న గ్లోబల్ ఫైనాన్స్.. ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల జాబితాను విడుదల చేసింది.
ఆయా దేశాల కొనుగోలు శక్తి సమానత్వం.. స్థూల దేశీయ ఉత్పత్తి ఆధారంగా వాటికి ర్యాంకులు ఇస్తూ లెక్క కట్టింది.దీని ప్రకారం చూస్తే.. టాప్ 10 దేశాల్లో అమెరికా తొమ్మిదో స్థానంలో ఉండటం గమనార్హం. ఇక.. చైనా అయితే.. టాప్ 10లో లేదు. ప్రపంచంలో అత్యంత చిన్నవిగా ఉండే దేశాలు అత్యంత సంపన్న దేశాలుగా నిలిచాయి. మరి.. మన సంగతేంటి? తాజా ర్యాంకింగ్ లో మన స్థానం ఎంతన్నది చూస్తే.. టాప్ 100లో కూడా లేని దుస్థితి.
భారత్ 127వ స్థానంలో నిలిస్తే.. మన కంటే కూడా దాయాది పాక్.. పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లు మరింత వెనుకబడి ఉన్నాయి. పాకిస్థాన్ 138వ స్థానలో నిలిస్తే.. దాని కంటే అధమ స్థానంలో బంగ్లాదేశ్ నిలిచింది. ఇక.. సంపన్న దేశాలకు మనకు మధ్య అంతరం ఎంతన్న విషయాన్ని చూస్తే.. ఆ దూరంగా చాలా చాలా ఎక్కువని చెప్పాలి. ఉదాహరణకు ప్రపంచంలోనే టాప్ వన్ సంపన్న దేశంగా లక్సెంబర్గ్ నిలిచింది.
ఆ దేశ జీడీపీ.. పీపీపీ 140,694 డాలర్లు (రూ.1.12 కోట్లు) ఉంటే భారత్ జీడీపీ పీపీపీ 8358 డాలర్లు (రూ.6.65 లక్షలు) మాత్రమే. అంటే.. టాప్ వన్ లో ఉన్న సంపన్న దేశంతో పోల్చినప్పుడు అందులో ఆరేడు శాతమే మనం ఉన్నట్లుగా అర్థమవుతుంది. దీంతో మన ఆర్థిక పరిస్థితి ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.
భారత్ జీడీపీ పీపీపీ 8358 డాలర్లు అయితే.. పాకిస్థాన్ 6470, బంగ్లాదేశ్ 6633 డాలర్లుగా చెబుతున్నారు. ఇక.. ప్రపంచానికి పెద్దన్నలా వ్యవహరించే అమెరికా విషయానికి వస్తే.. ఆ దేశ జీడీపీ పీపీపీల లెక్కల్లో 76,027 డాలర్లుగా నిలిచింది. రష్యా విషయానికి వస్తే ఈ జాబితాలో 60వ స్థానంలో నిలిచింది. టాప్ 10దేశాల విషయానికి వస్తే..
ర్యాంక్ దేశం జీడీపీ - పీపీపీ (డాలర్లలో)
01 లక్సెంబర్గ్ 1,40,694
02 సింగపూర్ 1,31,580
03 ఐర్లాండ్ 1,24,596
04 ఖతర్ 1,12,789
05 మకావో 85,611
06 స్విట్జర్లాండ్ 84,658
07 యూఏఈ 78,255
08 నార్వే 77,808
09 అమెరికా 76,027
10 బ్రూనై దారుస్సలాం 74,953