ప్రముఖ బంగారు ఆభరణాల కంపెనీ తనిష్క్ కొత్తగా రూపొందించిన ‘ఏకత్వ’ యాడ్ పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. తనిష్క్ యాడ్ ‘లవ్ జిహాద్’ ను ప్రొత్సహించేలా ఉందంటూ సోషల్ మీడియాలో ఆ యాడ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ యాడ్ ను నిలిపి వేయాలని, బాయ్ కాట్ తనిష్క్ అంటూ కొంతమంది నెటిజన్లు ప్రచారం చేశారు. మరికొందరు ఈ యాడ్ లో తప్పేమీ లేదంటూ అభిప్రాయపడ్డారు. ఈ యాడ్ పై విమర్శలు రావడం, సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం, దీంతోపాటు కొందరు తనిష్క్ ఉద్యోగులకు బెదిరింపులు రావడంతో తనిష్క్ వెంటనే ఆ యాడ్ ను తొలగించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ యాడ్ కు ‘ధి అడ్వర్టయిజింగ్ క్లబ్’, ‘ఇంటర్నేషనల్ అడ్వర్టయిజింగ్ అసోసియేషన్(భారత విభాగం)’ మద్దతు ప్రకటించాయి. ఆ యాడ్ రూపొందించిన తనిష్క్ సంస్థకు, తనిష్క్ ఉద్యోగులకు బెదిరింపులను ఆ సంస్థలు తీవ్రంగా ఖండించాయి. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు అర్థరహితమని, అసంబద్ధమైనవనని తెలిపాయి.
ఆ యాడ్ ను తాము నిశితంగా పరిశీలించామని, ఆ యాడ్ దేశంలోని ఏ సంస్థ, వర్గం, మతం, జాతీయత, వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేలా లేదని ఆ సంస్థలు తెలిపాయి. ప్రకటనల్లో సృజనాత్మకత. భావ వ్యక్తీకరణ ఉంటుందని, దానిని ప్రకటనలకే పరిమితం చేయాలని ఆ సంస్థలు పేర్కొన్నాయి. ఆ యాడ్ పై విమర్శలు రావడం దురదృష్టకరమని, వివాదాస్పదం కావడంతో ఆ యాడ్ ను తనిష్క్ తొలగించిందని, అయినప్పటికీ తనిష్క్ దుకాణాలకు, అందులోని ఉద్యోగులకు బెదిరింపులు రావడం సరికాదని అభిప్రాయపడ్డాయి.. తనిష్క్ పై జరుగుతున్న బెదిరింపులను కట్టడి చేసేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, వ్యాపారాలు సజావుగా సాగే వాతావరణం కల్పించాలని కోరాయి. కరోనా మహమ్మారి పంజా విసిరిన ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ కలిసి భిన్నత్వంలో ఏకత్వం చాటిచెప్పేలా పండుగ జరుపుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఆ యాడ్ రూపొందించమాని తనిష్క్ తెలిపింది. కొందరు మనోభావాలు దెబ్బతిన్నాయన్న నేపథ్యంలో ఆ యాడ్ తొలగించామని, అయినా బెదిరింపులు రావడం బాధాకరమని తనిష్క్ అభిప్రాయపడింది.