కరోనా వ్యాక్సినేషన్ కు సంబంధించి ఆసక్తికర అంశం ఒకటి వెల్లడైంది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించిన దాని ప్రకారం.. ప్రైవేటు టీకా కేంద్రాల్లో వ్యాక్సిన్ అందించే విషయంలో దేశంలో తెలంగాణ రాష్ట్రం టాప్ లో నిలిచినట్లుగా పేర్కొంది. తెలంగాణ తర్వాత ఢిల్లీ రాష్ట్రం నిలిచినట్లుగా పేర్కొంది. తెలంగాణలో 49.39 శాతం టీకాల్ని ప్రైవేటు కేంద్రాల్లో అందించినట్లుగా తేల్చారు.
ఇదే అంశంలో ఢిల్లీ 43.11 శాతంతో రెండోస్థానంలో నిలిచింది. చాలా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ పరిస్థితులు దారుణంగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. కొత్త కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో భారీగా కేసులు నమోదవుతున్న జిల్లాల పేర్లను వెల్లడించే క్రమంలో.. వ్యాక్సినేషన్ విషయంలో ఆయా రాష్ట్రాల పని తీరును ప్రస్తావించారు.
వ్యాక్సినేషన్ లో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలతో పోలిస్తే.. ప్రైవేటు ఆసుపత్రుల్లో జోరుగా టీకా కార్యక్రమం జరుగుతుందంటే.. సర్కారు ఫెయిల్ అయినట్లేగా? అన్న సందేహం కలుగక మానదు. ప్రైవేటులో నెంబర్ వన్ గా దూసుకెళుతున్న తెలంగాణ.. ప్రభుత్వ దవాఖానాల్లోనూ అగ్రస్థానంలో నిలిచేలా చర్యలు తీసుకుంటే.. పేదలు.. సామాన్యులకు ఎక్కువగా మేలు జరగటమే కాదు.. కోవిడ్ రోగ నిరోధక శక్తి మరింత పెరిగే అవకాశం ఉందన్న విషయాన్నిమర్చిపోకూడదు.