మోడీ దెబ్బకు పర్యాటకులు భారీగా పోటెత్తుతున్నారట!

Update: 2019-10-15 04:59 GMT
దేశాన్ని ప్రమోట్ చేసే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ తర్వాతే ఎవరైనా. ఏదైనా దేశాధ్యక్షులు భారత పర్యటనకు వస్తుంటే.. వారిని దేశ రాజధాని ఢిల్లీకో.. మరో మహానగరానికో పరిమితం చేయటం.. స్టార్ హోటళ్లలోనో.. ఖరీదైన అతిధి భవనాల్లోనో సమావేశాలు ఏర్పాటు చేసి.. ఒప్పందాలు.. విందులు.. భేటీలు పూర్తి చేసి వారిని సాగనంపటం ఒక అలవాటుగా ఉండేది.

దీన్ని బ్రేక్ చేస్తూ.. పలువురు కీలక దేశాధినేతలు దేశంలో పర్యటించేందుకు వచ్చిన వేళలో.. వారిని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో వారి పర్యటన ఉండేలా ప్లాన్ చేయటం మోడీ సర్కారు నుంచి స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. దీంతో.. ప్రముఖుల పర్యటన కారణంగా.. ఆయా ప్రదేశాల ప్రత్యేకత మరోసారి చర్చకు రావటంతో పాటు.. ప్రజలకు కొత్త ఉత్సుకతను రేపుతోంది. తాజాగా మహాబలిపురంలో దేశ ప్రధాని.. చైనా అధ్యక్షుడి భేటీల నేపథ్యంలో అక్కడి పర్యాటక ప్రదేశాల్ని మరింత అందంగా తీర్చిదిద్దారు.

తాజాగా ముగిసిన పర్యటన అనంతరం మహాబలిపురానికి పర్యాటకుల పోటెత్తుతున్నారు. ఇరువురు దేశాధినేతల భేటీ అనంతరం మహాబలిపురం వార్తల్లోకి రావటం.. అక్కడి చరిత్ర మరోసారి వార్తలుగా మారి.. ప్రజల్లోకి వెళ్లటంతో ఈ ప్రాంతాన్ని సందర్శించాలన్న తపన ఎక్కువైంది. దీనికి తగ్గట్లే.. తాజాగా భారీ ఎత్తున సందర్శకులు మహాబలిపురాన్ని సందర్శిస్తున్నారు.

పంచ రథాలు.. లైట్ హౌస్ తో పాటు పలు ప్రాంతాల్నిచాలా చక్కగా తీర్చిదిద్దారు. ఇక్కడున్న ప్రసిద్ధ తీర దేవాలయాన్ని పలు కారణాలతో ఇప్పటివరకూ అనుమతించేవారు కాదు. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎన్నడూ లేని విధంగా ఇక్కడి కట్టడాలు.. గోడలకు ప్రత్యేక అలంకరణలుచేసి అందంగా తీర్చిదిద్దారు. దీంతో.. పర్యాటకుల్లోఈ పర్యాటక ప్రాంతం మీద కొత్త ఆసక్తి వ్యక్తమవుతోంది. దీనికి తగ్గట్లే పర్యాటకులు రద్దీ భారీగా పెరిగింది. మోడీనా మజాకానా? దేశ పర్యాటకాన్ని మోడీ ప్రమోట్ చేస్తున్న తీరును అభినందించాల్సిందే.
Tags:    

Similar News