ఐదురాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందింది. దీంతో ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కీలక నేతలుగా ఉన్న రాహుల్, ప్రియాంక గాంధీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేస్తునట్లు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో టీపీసీసీ అత్యవసర సమావేశం నిర్వహించి సోనియా నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు తీర్మానం చేశారు. ఇందుకు సంబంధించిన తార్మానాన్ని ఏఐసీసీకి పంపింది. ఐదు రాష్ట్రాల్లో ఓటమిపై చర్చించిన తరువాత ఈ తీర్మానం చేశారు.
అలాగే రాజీవ్ పంచాయతీరాజ్ సంఘటన్ చైర్మన్ జయంతి నటరాజన్ సోమవారం భూదాన్ పోచంపల్లిలో ప్రారంభించనున్న పాదయాత్రపై చర్చించారు. 25 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పార్టీ ముఖ్యనేతలు అక్కడక్కడా పాల్గొనాలని కోరారు.
పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రారంభించామని, దీనిని విజయవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యంగా పార్టీ ముఖ్యులకు ప్రమాద బీమా చెల్లించేలా ప్రణాళిక వేయాలన్నారు.
ఈ సందర్భంగా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ పార్టీ అగ్రనేత రాహుల్ సమక్షంలో త్వరలో సమావేశం కానున్నట్లు తెలిపారు. గతంలో సోనియా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పుడు పార్టీ రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉందని, ఆ తరువాత కేంద్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. సోనియా, రాహుల, ప్రియాంకలు బలహీనులతైన వారి గురించి ప్రధాని మోదీ పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారని అడిగారు. ఉత్తరాఖండ్, గోవాలాంటి రాష్ట్రాల్లో టీఎంపీ దెబ్బతీసిందన్నారు.
ఉత్తరాఖండ్ లో బీజేపీ గెలుపునకు కేసీఆర్ కృషి చేశానన్నారు. మోదీ, కేసీఆర్ లు ఒక్కటేనని పైకి మాత్రమే మోదీని విమర్శిస్తున్నారన్నారు. పీకే తో సర్వేలు చేస్తూ నాటకమాడుతున్నారన్నారు. పంజాబ్ లో కాంగ్రెస్ ఓటమి గురించి నేర్చుకోవాలని, గొడవలు పక్కనబెట్టి కలిసికట్టుగా పనిచేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లోపు పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అందరూ కలిసి పనిచేస్తే రాష్ట్రంలో అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదన్నారు.
ఇదిలా ఉండగా టీపీసీసీ ఆధ్వర్యంలో నేడు మనఊరు-మనపోరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెట్టి, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొననున్నారు.