టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, అధికార టీఆర్ఎస్ పార్టీని దించి గద్దె నెక్కడం అనే ఎజెండాగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేవరకు ఆయన క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. త్వరలోనే రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ సైతం ఏర్పాటు చేశారు.
అయితే, ఈ పర్యటన కంటే ముందే రేవంత్ రెడ్డి పరువు తీసే విధంగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. పీసీసీ స్థానిక కార్యాలయం అయిన గాంధీభవన్ నుంచి మొదలుకొని జిల్లాల వరకు అన్ని చోట్లా అదే పరిస్థితి ఎదురైందని అంటున్నారు.
రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా వరంగల్లో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభ ప్రాంగణాన్ని నేడు రేవంత్ రెడ్డి పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే మలిదశ పోరాటానికి రైతు సంఘర్షణ సభ అంకురార్పణ అవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. తమ సమావేశం ద్వారా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆదరణ, తెలంగాణ రైతుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ద విధానాలను చాటి చెప్పనున్నట్లు వివరించారు.
అయితే, ఈ ఏర్పాట్లు రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్న సమయంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు జంగారెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి మధ్య విబేధాలు స్పష్టం అయ్యాయి. ఈ ఇద్దరు నేతల అనుచరుల మధ్య రచ్చ రచ్చ జరిగింది. దీంతో అవాక్కవడం మీడియా వంతు అయింది.
మరోవైపు ఇటీవల జరిగిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావ్ కు సిటీ అధ్యక్షురాలు మధ్య గాంధీభవన్‌లోనే వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీడియాలో వైరల్ అయింది. దీంతో సిటీ అధ్యక్షురాలిని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యూఐ సమావేశం రసాభాసగా మారింది.
గాంధీభవన్ ఆవరణలోని ఇందిరా భవన్ లో బుధవారం నిర్వహించిన సమావేశంలో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి రచ్చ రచ్చ చేశారు. బెంచీలు, కుర్చీలు విసిరేసుకున్నారు. మూడేళ్లుగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించకపోవడంపై అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను కొందరు నిలదీశారు. దీంతో జిల్లా అధ్యక్షులు, నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలోనే రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, వైస్ ప్రెసిడెంట్ చందనారెడ్డి మధ్య గొడవ మొదలైంది. మొత్తంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు రేవంత్ ప్రయత్నిస్తుంటే... ఆయన పరువు తీసేసేలా పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని అంటున్నారు.