లేని కరోనా సృష్టిస్తున్న ఏపీ అధికారులు?

Update: 2020-08-07 02:30 GMT
అసలే కరోనా.. ఏపీలో అయితే దాని తీవ్రత బోలెడు. రోజుకు పదివేల కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి స్థితిలో ఆదాయం కోల్పోయి చిన్నాచితకా వ్యాపారులతో బతకలేక కరోనా భయంతో దుకాణాలు నడిపిస్తున్నారు. కానీ ఎప్పుడు కేసులు పెరిగినా ఎక్కడా లేని విధంగా లాక్ డౌన్ అంటూ వ్యాపారాలను అధికారులు దెబ్బతీస్తున్నారని.. కొందరు వసూళ్లు చేస్తున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు.

కొన్ని జిల్లాల్లో అనవసరంగా చిన్న దానికి పెద్ద దానికి లాక్ డౌన్ పెట్టి అధికారులు ప్రజలు, వ్యాపారులను ఇబ్బందులు పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని కేసులకే అధికారులు లాక్ డౌన్ అంటూ విధించడం వల్ల పనిచేసుకుంటేనే బతికే చిన్న చితకా వ్యాపారస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కొందరు అధికారులు చిన్నా చితక వ్యాపారుల వద్ద లాక్ డౌన్ పెడతామంటూ బెదిరిస్తూ.. నిబంధనలు పాటించడం లేదని డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయా వర్గాల వారు ఆరోపిస్తున్నారు.

కరోనా తీవ్రత లేకున్నా.. ఉన్నట్టు సృష్టిస్తూ అధికారులు వ్యాపారస్థులను డబ్బుల కోసం బెదిరిస్తున్నారంటూ వారంతా వాపోతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే మీ వ్యాపారాల వల్లనే కరోనా సోకుతోందని దబాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని జిల్లాల్లో వ్యాపారులకు కరోనా టెస్టులు చేస్తూ పాజిటివ్ వస్తే మీ వల్లే వ్యాపిస్తోందని వసూల్లు చేస్తున్నారని వారు వాపోతున్నారు. నెగెటివ్ వస్తే వదిలి పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. అధికారులు మాత్రం పూర్తి డీటైల్స్ తీసుకోకుండా అక్కడ లాక్ డౌన్ పెట్టి వాళ్ల బిజినెస్ లకు అడ్డు చెప్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎక్కువగా మాట్లాడితే డబ్బులు ఇవ్వండని... అప్పుడే ఓపెన్ చేస్తాం అని అధికారులు అంటున్నారని వ్యాపార వర్గాలు వాపోతున్నాయి.

ఇలా లాక్ డౌన్ పేరిట వీధి, బడా వ్యాపారులను అధికారులు ఆడుకుంటున్నారనే ఫిర్యాదులు ఏపీలో ఆయా వర్గాల నుంచి వస్తున్నాయి. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ఈ లాక్ డౌన్ లో ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న వ్యాపారుల కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.
Tags:    

Similar News