ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌కు దారి ఇప్పించి.. రోగి ప్రాణాలను కాపాడిన హైదరాబాద్‌కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జీకి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. హైదరాబాద్‌లోని అబిడ్స్ వద్ద బాబ్జీ అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు వాహనాలను సుమారు రెండు కిలోమీటర్లు పరిగెత్తి వాహనాలను పక్కకు తప్పించి దారి ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమించాడు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ, సినీ ప్రముఖులు బాబ్జీపై ట్విట్టర్, ఫేస్బుక్లో ప్రశంసలు గుప్పించారు.అయితే విధులు ముగించుకుని రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వెళ్ళిన బాబ్జికి ఊహించని వ్యక్తి నుంచి ప్రశంస లభించడంతో అతను ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.
తండ్రి వచ్చేంతవరకు మేల్కొని ఉన్న బాబ్జీ కూతురు కంగ్రాట్యులేషన్స్ డాడీ.. అంటూ ఓ లేఖ రాసివ్వగా.. ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బుధవారం సాయంత్రం బాబ్జీ అంబులెన్స్‌కోసం ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఇందుకోసం సుమారు 2 కిలోమీటర్లు పరిగెత్తి వాహనాలను పక్కకు తప్పించాడు. ఆ రోజు రాత్రి 11 గంటలకు బాబ్జీ విధులను ముగించుకొని ఇంటికి వెళ్లాడు. అప్పటివరకు మేల్కొని ఉన్న బాబ్జీ కూతురు శరణ్య ‘కంగ్రాట్స్ డాడీ’ అంటూ ఓ పేపర్ మీద రాసి తండ్రికి ఇచ్చింది. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. తనకు ఎన్ని ప్రశంసలు దక్కినా కూతురు ఇచ్చిన ప్రశంసలు మాత్రం ఎప్పటికీ మరిచిపోలేనని బాబ్జీ ఉద్వేగంతో పేర్కొన్నారు. ఎన్ని ప్రశంసలుదక్కాయి..అన్నదానికంటే తన వల్ల ఓ ప్రాణం నిలబడింది అంటే ఎంతో సంతోషం కలుగుతోందని బాబ్జీ చెప్పాడు.
హ్యాట్సాఫ్ బాబ్జీ
రోగిని కాపాడటం కోసం తపన పడ్డ ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జీని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అభినందించారు. ‘బాబ్జీ కృషి అభినందనీయం. ట్రాఫిక్ సిబ్బంది అంతా ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ గర్వపడే పనిచేశావు.. హ్యాట్సాఫ్ బాబ్జీ’ అంటూ హరీశ్ ట్వీట్ చేశాడు. ఈ విషయంపై బాబ్జీ స్పందిస్తూ.. ‘ నేను కేవలం నా డ్యూటీని చేశాను. సక్రమంగా విధులు నిర్వర్తించినందుకే నాకు ఈ ప్రశంసలు దక్కుతున్నాయి. ఓ రోగి ప్రాణం కాపడటాన్ని నేను గర్వంగా ఫీలవుతున్నాను’ అని బాబ్జీ పేర్కొన్నారు.