అమెరికాలోని బ్లాక్ రాక్ ఏడారిలో ట్రాఫిక్ జామ్

Update: 2022-09-07 14:22 GMT
అమెరికాలోని నెవాడాలో ప్రతీ సంవత్సరం తొమ్మిది రోజుల పాటు నిర్వహించే సంగీత, సంస్కృతి ఉత్సవాల ముగింపు సోమవారం ముగిసింది.దీనికి వేలమంది తరలివచ్చారు.  ఈ బ్లాక్ రాక్ ఎడారిలోని వేదిక నుండి అందరూ ఒక్కసారిగా బయలుదేరడంతో ఏడారిలోని ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు.  

బయలుదేరిన వారు ఒకే సమయంలో వేలాది వాహనాలు వరుసలో రోడ్డుపైకి రావడంతో ఎనిమిది గంటల పాటు ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొని జనాలు ఎర్రటి ఎండలో హాహాకారాలు చేశారని మీడియా తెలిపింది. మూడు సంవత్సరాల కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఇక్కడ ఈ వేడుక నిర్వహించలేదు. ఈసారి  మొదటి బర్నింగ్ మ్యాన్ పండుగ చేశారు.. వినోదం పూర్తయిన తర్వాత జనాలు అంతా రోడ్డెక్కడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ రద్దీని చూపించే చిత్రాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

బర్నింగ్ మ్యాన్ అధికారిక ట్విట్టర్ ఖాతా కూడా సోమవారం ఇలా ట్వీట్ చేసింది, "ఏడారిలో నిరీక్షణ సమయం ప్రస్తుతం దాదాపు ఎనిమిది గంటలు. పరిస్థితులు మెరుగుపడే వరకు మీ నిష్క్రమణను ఆలస్యం చేయండి." అంటూ ప్రజలకు విన్నవించింది.  తొమ్మిది రోజుల ఉత్సవానికి కనీసం 80,000 మంది హాజరయ్యారని తెలిపింది. ఈ  ఫోటోలు వైరల్ గా మారాయి.  15 లేన్ల రహదారిలో వేల వాహనాలు ట్రాఫిక్‌ను మైళ్ల వరకు చూపించాయి.

"మీరు బర్నింగ్‌మ్యాన్ సౌందర్యాన్ని  చూడడానికి వచ్చారు.  వారం మొత్తం అనుభవించిన అత్యంత పండుగ చివర్లో ఇలా ట్రాఫిక్ జామ్ తో ఆవిరైంది.  ఎడారి నుంచి తప్పించుకోలేని విధంగా మారింది అంటూ నెటిజన్ బాధితులు నిట్టూర్చారు.   ట్రాఫిక్ లో చిక్కుకొని   "బర్నర్‌లు" అయ్యామని కొందరు వాపోయారు.  

కార్మిక దినోత్సవానికి ముందు జరిగిన బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ప్రజలు వారం రోజుల పాటు పార్టీ చేసుకోవడానికి విచిత్రమైన దుస్తులను ధరించి వేల సంఖ్యలో ఇక్కడికి చేరుతారు.  ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వచ్చి ఈ వేడుకలో పాల్గొంటారు.

బర్నింగ్ మ్యాన్ అని పిలిచే ఒక దిష్టిబొమ్మను దహనం చేయడంతో పండుగ ముగిసింది. 1989లో ప్రారంభమైనప్పటి నుండి ఈ పండుగను జరుపుకోవడం  సాంప్రదాయంగా వస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News