మనుషుల్లో ప్రేమ, అప్యాయత కరువవుతోంది.చిన్న పిల్లలు అని కూడా చూడకుండా కర్కషంగా 34మంది పసివాళ్లను చంపేశాడు ఓ మాజీ పోలీస్ అధికారి. అతడి కర్కషత్వానికి అమాయకులైన పసిమొగ్గలు రాలిపోయారు.
ఈ భయానక దారుణ ఘటన థాయిలాండ్ లో చోటుచేసుకుంది. ఓ మాజీ పోలీస్ అధికారి చైల్డ్ కేర్ సెంటర్(ప్రీస్కూల్)లో కాల్పులు జరపడంతో 34 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
థాయ్ లాండ్ లోని నోంగ్ బువా లమ్ పూ ప్రావిన్స్ లోని ప్రీ స్కూల్ చైల్డ్ డే కేర్ సెంటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.
మాజీ పోలీస్ అధికారే ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. అతడిని ఉన్నతాధికారులు కొన్ని రోజుల క్రితమే విధుల నుంచి సస్పెండ్ చేశారు.
కాల్పులు జరిపిన దుండగుడు పరార్ అయ్యాడు. కాల్పులతోపాటు కొందరిని నిందితుడు కత్తితో పొడిచి చంపినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. అతడు ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డాడన్నది స్పష్టత లేదు. జాబ్ లోంచి తీసేశారనే కక్షతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
ఓ ట్రక్కులో నిందితుడు తిరుగుతూ కనపడ్డాడని.. పలు ప్రాంతాల్లో అలెర్ట్ ప్రకటించామని చెప్పారు. కాగా థాయిలాండ్ లో ఇటువంటి కాల్పుల ఘటనలు పెరిగిపోతున్నాయి. నఖోన్ రాట్చసిమాలో 2020లో ఓ ఆర్మీ అధికారి కాల్పులు జరిపి 21మందిని చంపాడు. ఇప్పుడు మరోసారి అలాంటి మాజీ పోలీస్ నే ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం విషాదం నింపింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View