రైలు ప్రమాదం లో ఊహించని విధంగా ఓ యువకుడు మృతి చెందాడు. క్రాసింగ్ కోసం స్టేషన్ లో నిలిపిన రైలు దిగి పట్టాలపైకి వెళ్లిన అతడిని మరో రైలు ఢీకొనడంతో మృత్యువాత పడ్డాడు. దీనితో ప్రయాణికులు అక్కడికి చేరుకుని ఫొటోలు తీస్తున్నారు. ఆ సయమంలో అదే రైలులో ఉన్న ఓ యువతి కూడా ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను తన ఫోన్ లో ఫొటో తీసుకుంది. తల్లిదండ్రుల వద్దకు వచ్చి జరిగిన విషయం గురించి వివరించింది. అయితే తాను తీసిన ఫొటోలను చూస్తున్న ఫొటోలను జాగ్రత్తగా గమనించిన ఆమెకు - ఆ మృతదేహంపై ఉన్న దుస్తులు తన సోదరుడివేనని అనిపించింది. దీంతో ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే అక్కడికి వెళ్లి చూశారు. అక్కడ మృతిచెందింది తమ కుమారుడేనని గుర్తించి గుండెలు పగిలేలా ఏడ్చారు.
ఈ ఘటన పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో జరిగింది. రైల్లే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్ అనే వ్యక్తి మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి బొగ్గుగని వర్క్ షాప్ లో పనిచేస్తున్నాడు. శ్రీనివాస్ కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురు హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ చదువుతోంది. విద్యాసంస్థలు మూసివేయడంతో కూతురిని తీసుకొచ్చేందుకు శ్రీనివాస్ హైదరాబాద్ వెళ్లాడు. లగేజీ ఎక్కువగా ఉంటుందని భార్య, కుమారుడిని తనతో పాటు తీసుకెళ్లాడు. హైదరాబాద్ నుంచి సోమవారం కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ లో ఇంటికి బయలుదేరారు. పెద్దపల్లి రైల్వేస్టేషన్ లో సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ క్రాసింగ్ కోసం కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు. రైలుదిగి - పట్టాలపైకి వెళ్లిన శ్రీనివాస్ కుమారుడు విశాల్ ను సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. విశాల్ మృతదేహాన్ని చూసి అతని తల్లిదండ్రులు, సోదరి విలపించిన తీరు ప్రతి ఒక్కరిని కదిలించింది. ఇక, పెద్దపల్లి ఆస్పత్రిలో పోస్ట్ మార్టమ్ నిర్వహించిన అనంతరం విశాల్ మృతదేహాన్ని మందమర్రికి తరలించారు.