వైసీపీ గుండెళ్ళో రైళ్ళు....అది చూసేనా.... ?

Update: 2022-05-05 09:30 GMT
ఏపీలో గాలి మార్పు కచ్చితంగా కనిపిస్తోంది. మూడేళ్ళకే జనాలను జగన్ అంత వెగటు అయిపోరా. లేక చంద్రబాబు ఏలుబడి మళ్ళీ కావాలని కోరుకుంటున్నారా. లేకపోతే ఏమిటిది బాబు ఎక్కడికి వెళ్తే అక్కడ జనమేంటి. అది కూడా చంద్రబాబు విభజన ఏపీకి సీఎం కాక ముందు కూడా ఇంతటి ఆదరణ లేదు. నాడు అంటే 2014లో చంద్రబాబుకి కేవలం అనుభవం చూసి మాత్రమే కొత్త రాష్ట్రానికి ఉండాలని కోరుకున్నారు.

అయితే ఇపుడు అలా కాదు, జగన్ని చూశాక ఇక ఏపీకి ఏకైక దిక్కు బాబు అని జనాలు భావిస్తున్నారా. నిజం చెప్పాలీ అంటే చంద్రబాబు స్పీచ్ లలో కొత్తదనం ఏమీ లేదు. ఆయన గత మూడేళ్ళుగా చెప్పినదే చెబుతున్నారు. రొడ్డకొట్టుడు స్పీచ్ తోనే ఆయన రోడ్ షోలు చేస్తున్నారు.  ఇక జగన్ని ఆయన ఆడిపోసుకోవడమూ అదే తీరున ఉంది.

ఇక్కడ మరో విషయం ఉంది. తాను వస్తే ఏం చేస్తాను అని కూడా చంద్రబాబు చెప్పడంలేదు. ఆయన కేవలం మూడేళ్ళ జగన్ ఏలుబడిలో సాగుతున్న తీరునే జనాలకు వివరిస్తున్నారు. దానికే జనాల్లో ఇంత రియాక్షన్ వస్తోంది అంటే కచ్చితంగా అది అధికార పార్టీకి చేటు చేసేదే.

ఒక విధంగా ఏపీలోని జనాల్లో ఉన్న అసంతృప్తి అలా నిశ్శబ్ద విప్లవంగా దాగుంది. ఇలాంటివి ఎన్నికలకు కొన్ని నెలల ముందు మాత్రమే బయటపడతాయి. కానీ ఇపుడు అలా కాదు, ఇంకా రెండేళ్ల వ్యవధి ఉండగానే జనాలు రోడ్ల మీదకు వస్తున్నారు అంటే వైసీపీ ఏలుబడి మీద వారికి ఏదో విరక్తి కలిగి ఉండాలి.

మరి వైసీపీ చూస్తే ఏకంగా లక్షా ముప్పయి ఏడు వేల కోట్ల రూపాయలను తీసుకువచ్చి జనాలకు డైరెక్ట్ గా ఇస్తోంది. అనేక సంక్షేమ పధకాలు ఏపీలో అమలు అవుతున్నాయి. అప్పులు ఎక్కడ నుంచో తెచ్చి మరీ   సంక్షేమాన్ని జగన్ కొనసాగిస్తున్నారు. కరోనా వంటి కాలంలో కూడా పధకాలు ఎక్కడా ఆగలేదు.

మూడేళ్ళలో ఒక లెక్క ప్రకారం చూడాలీ అంటే పధకాలు అందుకున్న వారి కుటుంబానికి కనీసంగా లక్ష రూపాయల దాకా వచ్చి చేరింది. మరి ఆ కుటుంబాలు జై జగన్ అనాలి కదా. అంతే కాదు చంద్రబాబు పాలనలో తమకేమీ చేయలేదు అనే డ్వాక్రా మహిళలు కూడా జై జగన్ అనాలి కదా. సున్నా వడ్డీక పధకాలను ఇస్తున్న వేళ వైసీపీ మీద వ్యామోహం వదులుకోకూడదు కదా.

కానీ  చూడోబోతే అలా పరిస్థితి కనిపించడంలేదు. చంద్రబాబు టూర్ లో టీడీపీ మీద ప్రేమ కంటే వైసీపీ మీద వ్యతిరేకత కచ్చితంగా కనిపించింది అంటున్నారు. అంటే ఇక్కడ ఒక విషయం అర్ధం చేసుకోవాలి. జనాలు కేవలం పధకాలను మాత్రమే చూడడం లేదు, పాలననూ చూస్తున్నారు. అలాగే ప్రగతినీ చూస్తున్నారు.

ఇక మంత్రుల పనితీరును కూడా బేరీజు వేస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేల వ్యవహారశైలిని కూడా గమనిస్తున్నారు. ఇక ఇంటికి వచ్చి వాలంటీర్లు పెన్షన్లు చేతిలో పెడుతున్నారు కదా అంతా బాగుంది అనుకుంటున్న వేళ వాలంటీర్ల వ్యవస్థ మీద కూడా జనల్లో అసంతృప్తి కచ్చితంగా ఉందనే అంటున్నారు.

ఇలా చాలా కారణాల వల్లనే బాబుకు కనీ వినీ ఏరగని జనాదరణ లభిస్తోంది అని చెబుతున్నారు. ఎన్నికలకు రెండేళ్ళ ముందే ఇంత వెగటు వ్యతిరేకత ఉంటే 2024 ఎన్నికలు కనుక జరిగే అచ్చెన్నాయుడు చెప్పినట్లుగా 160 సీట్లు టీడీపీకి నిజంగా వచ్చినా వస్తాయా ఏమో

చంద్రబాబు సిక్కోలు మీటింగ్ తో పాటు ఉత్తరాంధ్రాలో ఆయన టూర్లకు జనాలు వస్తున్న తీరుతో వైసీపీ గుండేల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. అంతా బాగుంది, ఎన్నికల్లో 175 సీట్లు అని వైసీపీ హై కమాండ్ చెప్పినంత ఈజీగా గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ లేవు. టోటల్ గా చక్కదిద్దుకోవాలి. లేకపోతే మాత్రం ఇదే జనాలు రివర్స్ అవుతారు అన్న సంకేతాలను మాత్రం బాబు టూర్లు చెబుతున్నాయి.
Tags:    

Similar News