ట్రాన్స్‌జెండ‌ర్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి కిడ్నాప్‌

Update: 2018-11-27 18:34 GMT
తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టైన గోషామ‌హల్ అనూహ్య రీతిలో తెర‌మీద‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. గోషామహల్ అసెంబ్లీ స్థానం బరిలో బీజేపీ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ బరిలో ఉండగా... కాంగ్రెస్ నుంచి ముఖేష్ గౌడ్ పోటీ ఉన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓ ట్రాన్స్‌జెండర్‌గా బరిలోకి దిగిన చంద్రముఖి కిడ్నాప్‌న కు గురైంది. గోషామహాల్ నుంచి బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె... కనిపించడంలేదంటూ పోలీసులను ట్రాన్స్ జెండర్లు ఆశ్రయించారు.

బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఇందిర నగర్‌లో నివాసముండే చంద్రముఖి... ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం నుంచి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి కిడ్నాప్‌ చేశారని... బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పోలీసులు... విచారణ చేపట్టారు. ఇది తెలిసినవారి పనిగా అనుమానిస్తున్నారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఓ ట్రాన్స్‌జెండర్ ఇప్పుడు కనిపించకుండా పోవడంపై  ట్రాన్స్‌జెండర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నామినేష‌న్ వేసిన అనంత‌రం చంద్ర‌ముఖి మీడియాతో మాట్లాడుతూ తనకు ఈ ఎన్నికల్లో పోటీచేయడానికి అవకాశం కల్పించాలని రాష్ట్రంలోని అన్ని ముఖ్య పార్టీలని కోరినట్లు చంద్రముఖి తెలిపారు. అయితే అందరు తిరస్కరించినా చివరకు బీఎల్ఎఫ్ తనకు అవకాశం కల్పించిందన్నారు. బీఎల్ఎఫ్ భీపారంపై ఆమె నామినేషన్ వేసినట్లు తెలిపిన ఆమె...ఈ  అవకాశం కల్పించిన సీపిఎం పార్టీకి ధన్యవాదాలు తెలుపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని చంద్రముఖి తెలిపారు. సమాజంలో ట్రాన్స్‌జెండర్లు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందరితో సమానంగా తమకు గౌరవం దక్కాలంటే తాము చట్టసభల్లో ఉండాలనే ఆలోచనతో పోటీ చేస్తున్నానని తెలిపారు. గోషామహల్‌ ప్రాంతంలో అత్యధికంగా ట్రాన్స్‌జెండర్లు జీవనం సాగిస్తున్నారని, ఇక్కడి నుంచి పోటీ చేస్తేనే ఆశించిన స్థాయిలో గౌరవం లభిస్తుందని చెప్పారు.
Tags:    

Similar News