ఆ ఎంపీ 'వేషం' పై ట్రాన్స్ జెండ‌ర్ ఫిర్యాదు!

Update: 2018-08-13 09:43 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా - విభ‌జ‌న హామీల అమ‌లు కోసం సినీ న‌టుడు - చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్ రోజుకో వేషం వేస్తూ పార్ల‌మెంటు వెలుపల వినూత్న త‌ర‌హాలో నిర‌స‌న తెలుపుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే శుక్ర‌వారం నాడు శివ ప్ర‌సాద్....ట్రాన్స్ జెండ‌ర్ వేష‌ధార‌ణ‌లో వ‌చ్చి పార్ల‌మెంటు బ‌య‌ట నానా ర‌చ్చ చేశారు. ప్ర‌ధాని మోదీని.....మోదీ బావా...అంటూ సంబోధిస్తూ....జుగుప్స క‌లిగించే రీతిలో వ్య‌వ‌హరించారు. అంత‌టితో ఆగ‌కుండా....మ‌హిళ అయిన సోనియా గాంధీ వైపు అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు చేస్తూ చికాకు తెప్పించారు. మీడియా దృష్టిని ఆక‌ర్షించే క్ర‌మంలో ....శివ‌ప్ర‌సాద్ ఓ జోక‌ర్ లా మారిపోయార‌ని సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా, శివ ప్ర‌సాద్ పై కేసు న‌మోదైంది. తమ మనోభావాలు దెబ్బతీసేలా శివ ప్ర‌సాద్ ప్రవర్తించారని ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ ప్రతినిధి తమన్నా సింహాద్రి విజయవాడ గవర్నర్‌ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

`గే`స్ వేర‌ని - ట్రాన్స్ జెండ‌ర్స్ వేర‌ని స్ప‌ష్టం చేశారు.ఒక మ‌గాడై ఉండి....ఆయ‌న అలా ప్ర‌వ‌ర్తించార‌ని. అస‌లు ఆయ‌న‌కు సిగ్గుందా అని త‌మ‌న్నా ప్ర‌శ్నించారు. ఆయ‌న వేష‌ధార‌ణ `గే` లా ఉంద‌ని - చూడు పిన్న‌మ్మా...పాడు పిల్లాడు అని పాట పెట్టుకున్నార‌ని....అది `గే`స్ ని ఉద్దేశించిన పాట అని త‌మ‌న్నా అన్నారు. శివ‌ప్ర‌సాద్ ట్రాన్స్ జెండర్ వేషం వేశాన‌ని చెప్పడం దారుణమని - ఆయ‌న వేష‌ధార‌ణ త‌మ‌ను అవ‌మానించేదిలా ఉంద‌ని అన్నారు.  తాము అవ‌య‌వ మార్పిడి చేసుకొని ఆడ‌వారిలాగా మారి....గౌర‌వంగా బ్ర‌తుకుతున్నామ‌ని - ఆయ‌న త‌మ‌ ప‌రువును తీశారని అన్నారు. శివ ప్ర‌సాద్ ను చూసిన వారు ...ట్రాన్స్ జెండ‌ర్స్ రోడ్ల‌పై ఇలా చేస్తార‌ని అనుకుంటార‌ని, తమను ఆయ‌న అవమానించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివ‌ప్ర‌సాద్ తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News