విమర్శించడానికి నోరుంటే చాలు.. లేదంటే సోషల్ మీడియా అకౌంట్ ఉన్నా చాలు.. అదే మన గొంతుక అవుతుంది. అలానే నాడు తీవ్ర నిరసన తెలిపారు మోడీజీ.. కానీ నేడు ప్రధాని అయ్యాక దాన్ని మరిచారు. నాడు విమర్శించిన మోడీ నే నేడు పెంచుతున్నారు. అందుకే మోడీకి బుద్ది చెప్పడానికి ఆయన పాత ట్వీట్ ను బయటకు తీశారు కొందరు నెటిజన్లు. ఆయనను ఉతికి ఆరేస్తున్నారు.
ప్రధాని మోడీ 2012 జూన్ 27న గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాడు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తోంది. ఈ క్రమంలోనే గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఓ హాట్ ట్వీట్ చేశారు. దేశంలో పెట్రోల్ రేట్లను పెంచుతో కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లు కొల్లగొడుతోందని.. ఇది ప్రజలపై పెను భారాన్ని మిగులుస్తోందని.. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందానికి పెట్రో ధరల పెంపే నిదర్శనమని నాడు గుజరాత్ సీఎం మోడీ ఎండగట్టారు.
ఇప్పుడు ఆ పాత ట్వీట్ ను కొందరు నెటిజన్లు బయటకు తీశారు. మోడీని ఎండగడుతున్నారు. కాంగ్రెస్ పై విమర్శలు చేసిన మోడీ ట్వీట్ లో బీజేపీని పెట్టి గుజరాత్ నుంచి దోచుకుంటున్న మొత్తాన్ని దేశానికి అన్వయించి ఏకిపారేస్తున్నారు.
నాడు సీఎంగా నినదించిన మోడీజీ ఇప్పుడు ఎందుకు పెట్రో ధరలు పెంచుతున్నారని.. ఆయన ట్వీట్ నే బయటకు తీసి వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ట్వీట్ తెగ హల్ చల్ చేస్తోంది.