త్రిబుల్ తలాక్ బిల్లుపై ఎట్టకేలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పంతం నెగ్గించుకున్నారు. రెండోసారి ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్రం బిల్లుపై చర్చ పెట్టింది. ఈ చర్చలో ప్రతిపక్షాలు బిల్లును వ్యతిరేకించినాన బిజెపి మాత్రం తనకు ఉన్న బలంతో బిల్లు పాసయ్యేలా చేసింది. మోడీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే ఈ బిల్లు ప్రవేశపెట్టగా ఇప్పుడు మరోసారి లోక్ సభలో ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేయించారు. మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా భార్యకు విడాకులు ఇవ్వడం నేరమని ఇందుకు మూడేళ్ల జైలు శిక్ష విధించేలా ముసాయిదా బిల్లులో పొందుపరిచారు. బిజెపి 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి త్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యవహరించింది.
అయితే ముస్లింలలో కొన్ని వర్గాలు ఇది మతానికి సంబంధించిన అంశం అని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడానికి ఈ అంశం కూడా ఒక కారణం అన్న చర్చ నడిచింది. ఆ ఎన్నికల్లో బిజెపి 403 సీట్లలో ఒక్క మైనార్టీ వ్యక్తికి సీటు ఇవ్వకపోయినా మైనార్టీలు ఉన్న నియోజకవర్గాల్లో తిరుగులేని విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో ముస్లిం మహిళల నుంచి బీజేపీకి భారీ ఎత్తున ఓటింగ్ జరిగింది. ఇక తాజాగా లోక్ సభలో ఈ బిల్లు పాస్ అయ్యే క్రమంలో మరోసారి ప్రతిపక్షాల నుంచి ఇది ముస్లింల ఆత్మాభిమానానికి సంబంధించిన అబ్జెక్షన్లు వచ్చాయి. బిజెపి మాత్రం ఇది ముస్లిం మహిళల గౌరవానికి సంబంధించిన అంశంగా పేర్కొంది.
బిల్లుపై ఎన్డీయే మిత్రపక్షం జేడీయూతోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. వ్యతిరేకంగా 82 మంది ఓటు వేశారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ సైతం ఈ బిల్లుపై పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. బిల్లు చర్చకు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులు మాట్లాడుతూ పోలీసులు - ప్రభుత్వం దీని ద్వారా ముస్లింల ఆచారాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఆరోపించాయి. ఇక త్రిపుల్ తలాక్ ద్వారా విధించే మూడు సంవత్సరాల జైలు శిక్షపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ త్రిపుల్ తలాక్ పై సుప్రీం కోర్టు తీర్పు చెప్పాక కూడా 345 కేసులు నమోదయ్యాయని... కొంత మంది బాధితులు స్వయంగా సుప్రీమ్ ను ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు కూడా చట్టం తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.వాస్తవానికి 2017లో సుప్రీం కోర్టు ట్రిపుల్ తలాక్‌ను నిషేధించినా ఈ పద్ధతి కొనసాగుతుండటంతో బీజేపీ పట్టుబట్టి దీనిని నిషేధిస్తూ చట్టం తీసుకు వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేసి చివరకు సక్సెస్ అయ్యింది.