నిజంగా వినాల్సిన మాట ఇది. ఇలాంటివి అస్సలు మిస్ కాకూడదు. ప్రజాస్వామ్యంలో అందరూ ఒక్కటే. ఒక్కొక్కరికి కానీ.. ఒక్కో మతానికి కానీ ఒక్కో రూల్ ఉండకూడదు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అభిప్రాయభేదం ఉంటుందని అనుకోం. ఎందుకంటే ఒకే దేశం.. ఒకే చట్టం ఉండాలే కానీ.. మతానికి.. ప్రాంతానికి.. కులానికో చట్టం ఉండకూడదు. ప్రత్యేక పరిస్థితుల్లో ఒకట్రెండు అంశాల్లో కాస్త వ్యత్యాసాలు ఉండొచ్చే కానీ.. మౌలికంగానే తేడాలు ఉండకూడదు. అయితే.. రాజ్యాంగం మాత్రం వేర్వేరు మతాలకు సంబంధించిన చట్టాల్ని చేశారు. అప్పటి కాల పరిస్థితులకు తగినట్లుగా వాటిని తయారు చేశారని అనుకుంటే.. ప్రపంచమే ఒక కుగ్రామంగా మారుతున్న వేళ.. అందరికి ఒకే చట్టం ఉండాలనే వాదనను పలువురు వినిపిస్తుంటారు.
ఒక వ్యక్తి ఒక మహిళ కంటే ఎక్కువమందిని పెళ్లాడితే నేరం. అయితే.. ముస్లిం పురుషుడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి తన భార్యతో విడాకులు పొందాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. లేదంటే.. చట్టబద్ధంగా విడాకులు తీసుకునే వీలుంది. కానీ.. ముస్లిం పురుషుడు ‘తలాక్’ అన్న మాటను మూడుసార్లు అంటే చాలు.. విడాకులు వచ్చేసినట్లే. భార్యకు ఇష్టం ఉన్నా లేకున్నా భర్త ఇష్టంతోనే ఆమె జీవితం.. భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అప్పుడెప్పుడో పెట్టిన ఈ విధానాన్ని ఇప్పడు కూడా అనుసరించాలా? అన్నది ఓ పెద్ద సందేహం.
అలాంటి డౌట్ వచ్చిన షాయరా బాను మరికొంతమంది కలిసి సుప్రీంను ఆశ్రయించారు. ట్రిపుల్ తలాక్ ను బ్యాన్ చేయాలని కోరింది. దీనిపై స్పందించిన సుప్రీం ముస్లిం పర్సనల్ లా బోర్డును అఫిడవిట్ ను దాఖలు చేయాలని కోరింది. ఈ సందర్భంగా బోర్డు ఆసక్తికర వ్యాఖ్యల్ని చేసింది. 68 పేజీలతో ఒక అఫిడవిట్ ను సమర్పించింది. ముస్లిం పురుషుడు ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవచ్చని.. నాలుగు పెళ్లిళ్ల వరకూ అనుమతి ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేయటంతోపాటు.. ఒకవేళ అలాంటిది లేకుంటే వ్యభిచారం ఎక్కువ అవుతుందని పేర్కొనటం గమనార్హం. బహుభార్యత్వాన్ని ఇస్లాం అనుమతిస్తుంది కానీ.. దాన్ని ప్రోత్సహించదని పేర్కొంది. తన 68 పేజీల ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొన్న మరికొన్ని అంశాలు చూస్తే..
= ముస్లింలలో బహుభార్యత్వాన్ని నిషేధిస్తే విచ్చలవిడి వ్యభిచారానికి దారులు తెరిచినట్లు అవుతుంది.
= ఖురాన్ హదీసుతో పాటు.. ముస్లిం సమాజంలో నెలకొన్న ఏకాభిప్రాయం ప్రకారం పురుషుడు నాలుగు పెళ్లిళ్లు చేసుకునేందుకు అనుమతిస్తుంది.
= బహు భార్యత్వం మహిళల రక్షణ కోసమే. సామాజిక.. నైతిక అవసరాల మేరకు పురుషులు ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటారు.
= తమ భార్యల పట్ల ప్రేమ.. సహానుభూతితో వ్యవహరించటం ఎంతో ముఖ్యం.
= బహుభార్యత్వాన్ని ఇస్లామిక్ మూల గ్రంథాలు అనుమతించాయి కాబట్టి దానిని నిషేధించినట్లుగా ఎవరూ పేర్కొనరాదు.
= బహుభార్యత్వం అన్నది పురుషుడి సంతోషాలు.. కోర్కెలు తీర్చుకోవటానికి కాదు. అదొక సామాజిక అవసరం.
= విడాకుల విషయంలో పురుషులు ఉద్వేగాలను అదుపు చేసుకుంటారు. వారు తొందరపాటుతో వ్యవహరించరు.
= విడాకుల విషయంలో ముస్లిం పురుషులు ఏకపక్షంగా వ్యవహరించటానికి.. అపరిమితమైన అధికారం ఉంటుందన్న అభిప్రాయం సరికాదు.
= పురుషుల కంటే మహిళలు అధికంగా ఉంటే పెళ్లి చేసుకోవటానికి ప్రాధాన్యత ఇస్తారో.. లేక ఒక భార్యగా ఉండే హక్కులన్నీ వదులకొని పురుషులకు ఉంపుడు గత్తెలుగా ఉంటారో వారే తేల్చుకోవాలి.