ట్వీట్ చేసి లోకేశ్ చాలా పెద్ద త‌ప్పు చేశాడట‌!

Update: 2018-10-27 08:05 GMT
ఏదో పెద్ద వ‌య‌సులో నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడి త‌ప్పులో కాలేయ‌టం చంద్ర‌బాబుకు తెలిసినంత బాగా మరెవ‌రికీ తెలీదు?  ఎవ‌రి మీద ఎప్పుడు ఎలా విరుచుకుప‌డాలో త‌న‌కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీద‌ని తెలివిని ప్ర‌ద‌ర్శించే చంద్ర‌బాబు.. తాజాగా జ‌గ‌న్ పై జ‌రిగిన క‌త్తి దాడి ఎపిసోడ్‌లో అడ్డంగా బుక్ అయ్యార‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.

చరిత్ర‌ను చూస్తే.. బాధితుడు ఎంత ప్ర‌త్య‌ర్థి అయినా.. ఊహించ‌ని ప‌రిణామం జ‌రిగిన‌ప్పుడు మిగిలిన‌వి వ‌దిలేసి.. ఒక మ‌నసున్న మ‌నిషిగా స్పందించ‌టం చాలా అవ‌స‌రం. బాబులో అలాంటివి ఇంకాస్త ఏమైనా మిగిలిన ఉన్నాయ‌న్న భ్ర‌మ‌ల్లో ఉన్న వారికి జ‌గ‌న్ పై జరిగిన క‌త్తి దాడి ఫుల్ క్లారిటీ ఇచ్చేలా చేసింద‌ని చెప్పాలి.

జ‌గ‌న్ పై దాడి జ‌రిగిన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చినంత‌నే.. ఎదురుదాడి మొద‌లెట్టేసి.. తాను పైచేయి సాధించాల‌న్న ప్లాన్ అడ్డంగా ఫెయిల్ కావ‌ట‌మే కాదు.. కొత్త తిప్ప‌ల్ని తెచ్చి పెట్టింద‌న్న మాట వినిపిస్తోంది. తండ్రి చేసిన త‌ప్పుల్ని వారి వార‌సులు తెలివైన వారైతే స‌రిదిద్దే ప్ర‌య‌త్నం చేస్తారు. కానీ.. ఏపీలో చంద్ర‌బాబుకు మించిన చిన‌బాబు అందుకు భిన్నం. త‌న తండ్రి చేసే త‌ప్పుల‌కు రెట్టింపు త‌ప్పులు చేయ‌టం ఆయ‌న‌కు అల‌వాటు.

తాజాగా అలాంటి త‌ప్పునే లోకేశ్ చేశార‌ని చెప్పాలి. జ‌గ‌న్ పై జ‌రిగిన క‌త్తి దాడిపై స్పందిస్తూ.. ట్విట్ట‌ర్ లో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌పై ప‌లువురు మండిప‌డుతున్నారు. మైకు ప‌ట్టుకుంటే చాలు మాట్లాడే నాలుగు మాట‌ల్లో ఒక్క‌టైనా త‌ప్పు మాట్లాడ‌కుండా ఉండ‌లేని లోకేశ్ తీరుపై సొంత పార్టీ నేత‌లు వేసుకునే జోకులు చాలానే తెలిసిన‌వి.

మైకు ఉన్న‌ప్పుడు త‌ప్పే త‌ప్పుల‌కు భిన్నంగా... ట్విట్ట‌ర్ లో మాత్రం అద్దె రైట‌ర్ల‌ను న‌మ్ముకొని పెట్టే ట్వీట్ల‌లో లాజిక్కు మిస్ కావ‌టం కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంద‌ని చెప్పాలి. చిన‌బాబు తెలివి మొత్తం ఆయ‌న పెట్టే పోస్టుల్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తూ ఉంటుంది.

జ‌గ‌న్ పై జ‌రిగిన దాడి నేప‌థ్యంలో తండ్రికి త‌గ్గ‌ట్లే చిన‌బాబు స్పందిస్తూ.. సానుభూతి కోస‌మే జ‌గ‌న్ త‌న‌పై దాడి చేయించుకున్నారంటూ పెట్టిన ట్వీట్ ను తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టేస్తున్న వారు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్నారు.

ఏ నేతకైనా బుర్ర‌.. బుద్ధి ఉంటే ఇలాంటి మాట మాట్లాడ‌ర‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. ఒక‌వేళ‌.. అలాంటిదే ప్లాన్ చేసి ఉంటే.. పాద‌యాత్ర లాంటి భారీ క‌స‌ర‌త్తు.. శారీర‌క శ్ర‌మ చేయాల్సిన అవ‌స‌రం ఏముంది? ఏదో ఒక‌చోట ప్లాన్ చేసుకుంటే  స‌రిపోతుంది. అయినా.. ఎవ‌రైనా బుద్ధి ఉన్న అధినేత ఎవ‌రైనా ఇంత చిల్ల‌ర‌గా ఆలోచిస్తారా?  ఇవాల్టి రోజున ఉన్న ప‌రిస్థితుల‌కు ఇలాంటి వెధవ ఐడియాలు వేయాల‌న్న ఆలోచ‌న కూడా రాని ప‌రిస్థితి. అయిన‌ప్ప‌టికీ.. అదేమీ ప‌ట్ట‌కుండా లోకేశ్ బాబు ట్వీట్లు చేస్తున్నారంటే అయ్య‌గారి ఆలోచ‌న‌ధోర‌ణి ఎక్క‌డి వ‌ర‌కూ వ‌చ్చి ఆగిందో ఇట్టే అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి.

స‌మ‌యం.. సంద‌ర్భం చూసుకోకుండా మ‌న‌సుకు తోచిన‌ట్లుగా చేసే ఈ త‌ర‌హా ట్వీట్ల‌కు ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి రియాక్ష‌న్ ఉంటుంద‌న్న‌ది.. సోష‌ల్ మీడియాలో చిన‌బాబును ట్రోల్ చేస్తున్న వైనాన్ని చూస్తే అర్థ‌మైపోతుంది. అయినా.. చిన‌బాబు తొంద‌ర కానీ.. నిజాలు కాస్త నిమ్మ‌ళంగానే బ‌య‌ట‌కు వ‌స్తాయి. అలాంటివేళ‌.. ఈ తొంద‌ర‌పాటు ట్వీట్లు లేనిపోని తిప్ప‌లు తెచ్చి పెడ‌తాయ‌న్న విష‌యాన్ని గుర్తిస్తే మంచిద‌న్న హిత‌వు ప‌లువురి నోట వినిపిస్తోంది.
Tags:    

Similar News