కేటీఆర్ పై నోరుజారిన పొన్నం..

Update: 2018-08-17 05:21 GMT
రాహుల్ పర్యటన ముగిసిన నేపథ్యంలో తెలంగాణ ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ మొన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. కాంగ్రెస్ నేతలు కొత్త బిచ్చగాళ్లు - లుచ్చాగాళ్లు అంటూ  మండిపడ్డారు. రాహుల్ అడుగుపెట్టిన చోటల్లా కాంగ్రెస్ పార్టీ వినాశనమే అని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. తాజాగా కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసి కౌంటర్ ఇచ్చాడు కరీంనగర్ మాజీ ఎంపీ - పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్..

పొన్నం మాట్లాడుతూ ‘అమెరికాలో చిప్పలు కడుక్కునే నువ్వు కాంగ్రెస్ ను విమర్శించే అర్హత లేదని’ ఘాటుగా విమర్శించారు. అసలు నీ అయ్యా కేసీఆర్ కు రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీనేననే విషయాన్ని మరిచిపోవద్దు అని కేటీఆర్ కు సూచించారు. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని.. చీమలు పెట్టిన పుట్టలో పాముల దూరి కేటీఆర్ వచ్చాడని.. పిచ్చిపిచ్చిగా మాట్లాడడం మానుకోవాలని.. అమెరికాలో చదివిన విజ్ఞత ఉంటే చర్చకు రావాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ అధినేత రాహుల్ పర్యటనతో టీఆర్ ఎస్ లో వణుకు మొదలైందని పొన్నం అన్నారు. టీఆర్ ఎస్ చేయించిన సర్వేల్లో ఆ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని.. అందుకే ముందస్తు ఎన్నికలకు ఆ పార్టీ సిద్ధపడుతోందని తెలిపారు. టీఆర్ ఎస్ నేతలను ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ నేతలు కంటి పరీక్షలు చేయించుకోవాలంటున్న మంత్రులే ముందుగా పరీక్షలు చేయించుకోవాలని సెటైర్ వేశారు.
Tags:    

Similar News