తెలంగాణ రాష్ట్ర సమితి.. సీమాంధ్ర.. ఈ రెండు పదాలకు అస్సలు పొసగదు. టీఆర్ ఎస్ పార్టీ పుట్టిందే సీమాంధ్రులపై వ్యతిరేకతతో. ఆ పార్టీ ఎదిగింది.. తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కూడా సీమాంధ్ర వ్యతిరేక స్వరంతోనే. అలాంటి పార్టీ ఇప్పుడు జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో 15 టికెట్లను సీమాంధ్రులకు కేటాయించడం విశేషం. అంతే కాదు.. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తామంటూ 150 మందికి పైగా ఆ పార్టీకి దరఖాస్తులు కూడా చేసుకున్నట్లు తేలింది. ఈ గణాంకాలు మిగతా పార్టీలకు, రాజకీయ విశ్లేషకులకు కూడా మింగుడు పడటం లేదు.
జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచారం మొదలైన నాటి నుంచి సీమాంధ్రులపై విపరీతమైన ప్రేమ కురిపిస్తూ వారికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్న టీఆర్ ఎస్ పార్టీ.. సీమాంధ్రుల ఓట్లు ఎక్కువ ఉన్న డివిజన్లలో వ్యూహాత్మకంగా సెటిటర్లను రంగంలోకి దింపడానికి వ్యూహం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తమకు వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించిన సమర్థులైన 15 మందినని.. కూకట్ పల్లి - అమీర్ పేట - సోమాజిగూడ - మియాపూర్ - జూబ్లీహిల్స్ - వెంగళరావు నగర్ - లాంటి సీమాంధ్రుల ప్రభావం బాగా ఉన్న డివిజన్లలో రంగంలోకి దించుతోంది. ఈ డివిజన్లన్నీ తమకు ఖాయం అనుకుని ధీమాగా ఉన్న ప్రత్యర్థి పార్టీలకు ఇది దిమ్మదిరిగే షాకే. ఐతే అభ్యర్థుల్ని దించడంతో సరిపోతుందా.. వాళ్లను గెలిపించుకోవాలి కదా అని ఎద్దేవా చేసేవాళ్లూ లేకపోలేదు కానీ.. టీఆర్ ఎస్ వ్యూహం మాత్రం అద్భుతం అంటున్నారు విశ్లేషకులు.