కేసీఆర్ జాతీయ పార్టీ పేరు ఇదే!

Update: 2022-10-05 08:15 GMT
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా టీఆర్ఎస్ పేరును  భారత్ రాష్ట్ర సమితి(‘బీఆర్ఎస్)గా  మారుస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో పేరు మార్పుపై ప్రవేశపెట్టిన తీర్మానానికి 283 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

తెలుగువారితోపాటు హిందీలోనూ సులభంగా అర్థమవుతుందనే ఉద్దేశంతో భారత్ రాష్ట్ర సమితి పేరు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

టీఆర్ఎస్ లో తెలంగాణ బొమ్మ అందులోని 33 జిల్లాలు పార్టీ జెండాలో కనిపిస్తే.. బీఆర్ఎస్ లో భారతదేశ పటంను ముద్రించారు. కేవలం తెలంగాణ ప్లేసులో భారత్ వచ్చి చేరింది.

ఇక టీఆర్ఎస్ పేరు మార్చుతూ భారత రాష్ట్ర సమితిగా ఎన్నికల కమిషన్ కు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి  కేకే పంపారు.  మాజీ ఎంపీ వినోద్, లీగల్ టీంలు ఎన్నికల కమిషన్ కు అందజేస్తారు.

టీఆర్ఎస్ ను  భారత్ రాష్ట్ర సమితిగా గుర్తించాలని కోరుతూ ఈసిని కొరేందుకు సాయంత్రం ఒక టీం ఢిల్లీ వెళ్లనుంది.

ఈసీ దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలను గమనించి అభ్యంతరాలు లేకుండా పేరును ఖాయం చేసి గుర్తును కేటాయిస్తారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News