ఇంత చిత్రమైన రాజకీయం దేశంలో మరే రాష్ట్రంలోనూ చోటు చేసుకోదేం. మొన్నటికి మొన్న.. సరిగ్గా మూడున్నర నెలల క్రితం ఏ నేత అయితే.. టీఆర్ ఎస్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారో.. ఏ అభ్యర్థి అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని తూర్పార పట్టారో.. ఇప్పుడు అదే నాయకులకు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలో దింపుతున్నారు.
మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. డిసెంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల చేతుల్లో ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థులకు తాజాగా లోక్ సభ ఎన్నికల్లో గులాబీ బాస్ టికెట్లు కన్ఫర్మ్ చేసి బరిలోకి దింపారు.
మొన్నటి వరకూ ఏ నేత ఓటమి కోసం ప్రజల దగ్గరకు వెళ్లారో.. ఇప్పుడు అదే నేతల్ని గెలిపించాలని కోరుతూ తిరగాల్సిన పరిస్థితి టీఆర్ ఎస్ అభ్యర్థులకు ఎదురవుతోంది. ఖమ్మం టీఆర్ ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నామా నాగేశ్వరరావు సంగతే చూస్తే.. ఆయన మొన్నటి ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానానికి టీడీపీ తరఫున పోటీ చేశారు. ఓటమి పాలయ్యారు.
నామాను ఓడించాలని డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో ప్రచారం చేసిన నాటి టీఆర్ ఎస్ అభ్యర్థి.. నేడు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఫువ్వాడ అజయ్ కుమార్ ఇప్పుడు నామా కోసం ఎన్నికల ప్రచారం కోసం చెమటలు చిందించాల్సి వస్తోంది. ఇదొక్క పువ్వాడకే ఎదురవుతున్న ఇబ్బంది కాదు.. పలువురు టీఆర్ ఎష్ ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న సమస్యగా చెప్పక తప్పదు. పెద్దపల్లి నుంచి లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న బోర్లకుంట వెంకటేశ్ కోసం.. మొన్నటి దాకా ఆయన్ను తిట్టిపోస్తూ.. ఓడించాలంటూ కాళ్లకు బలపం కట్టుకు తిరిగిన బాల్క సుమన్.. ఇప్పుడు అందుకు భిన్నంగా అదే అభ్యర్థికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటేసి గెలిపించాలని ఓటర్లను అడుగుతున్న పరిస్థితి.
ఇలా.. మొన్నటి వరకూ కడుపులో కత్తులుపెట్టుకొని.. ఏ నేత ఓటమి కోసం ప్రయత్నాలు చేశారో.. ఇప్పుడు అదే రాజకీయ నేత ముఖానికి నవ్వు పులుముకొని.. ఒకనాటి తన ప్రత్యర్థి.. తాజా ఫ్రెండ్ అయిన అభ్యర్థులకు ఓట్లు వేయాలని ప్రజలను కోరుతున్నారు. ఇంత సిత్రమైన సీన్ తెలుగు రాష్ట్రా్ల్లో ఎప్పుడూ కనిపించి ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వినేందుకు.. చదివేందుకే మనకు ఇబ్బందిగా ఉంటే.. ప్రజల్లో తిరుగుతూ ఓట్లు వేయాలని ప్రచారం చేస్తున్న అధికారపక్ష ప్రజాప్రతినిధుల పరిస్థితి మరింత దారుణంగా చెప్పక తప్పదు.
మొన్నటి వరకూ ప్రత్యర్థులుగా.. నేడు ఫ్రెండ్స్ గా మారి ప్రచారం చేస్తున్న వారిని చూస్తే..
% గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ చేతిలో ఓడి.. ఆ తరువాత టీఆర్ ఎ్‌సలో చేరిన మొన్నటి కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతా్‌పరెడ్డి తాజాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి తరఫున హరీశ్ రావుతో కలిసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
% ఆర్మూర్‌లో టీఆర్ ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలిత సైతం గులాబీ తీర్థం పుచ్చుకొని.. తనను ఓడించిన ఆశన్నగారి జీవన్‌రెడ్డితో కలిసి నిజామాబాద్ లో కల్వకుంట్ల కవిత విజయం కోసం పని చేస్తున్నారు.
% చేవెళ్ల నుంచి గడిచిన రెండు దఫాలుగా ప్రత్యర్థులుగా తలపడ్డ ఎమ్మెల్యే కాలె యాదయ్య, కేఎస్ రత్నం ఇద్దరూ ఇప్పుడు టీఆర్ ఎ్‌సలోనే ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇద్దరూ కలిసి టీఆర్ ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నారు.
% కాంగ్రెస్ నుంచి ఆలేరు, మానకొండూరు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి ఓటమిపాలైన బూడిద బిక్షమయ్య గౌడ్, ఆరెపల్లి మోహన్ లు కూడా టీఆర్ ఎస్ లో చేరారు. వీరిద్దరూ ప్రస్తుతం టీఆర్ ఎస్ అభ్యర్థి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడంత మంది టీడీపీ.. కాంగ్రెస్ నేతలు ఇప్పుడు టీఆర్ ఎస్ అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.