తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఈరోజు తనకు అచ్చొచ్చిన కరీంనగర్ నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు. ఈ సాయంత్రం జరిగే తొలి టీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ 10 మంది అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది., నిన్న రాత్రి వరకు ముఖ్య నాయకులతో సమాలోచనలు జరిపిన కేసీఆర్ లోక్ సభ అభ్యర్థుల ప్రక్రియను తుదిదశకు చేర్చారని సమాచారం. వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ ఈసారి అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేస్తోందని తెలుస్తోంది.
కాంగ్రెస్ పోటీ అభ్యర్థులు ఎవరు.. ఆయా రాజకీయ, సామాజిక సమీకరణాలను బేస్ చేసుకొని ఇప్పటికీ దాదాపు 10స్థానాల్లో అభ్యర్థులను కేసీఆర్ ఖరారు చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆ 10 మంది ఎంపీ అభ్యర్థులకు ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండండి.. నామినేషన్ దాఖలుకు అవసరమైన అన్నింటినీ సిద్ధం చేసుకోవాలని.. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని.. ఎవరికీ ఈలోగా చెప్పవద్దని టీఆర్ఎస్ ఆశావహులకు కేసీఆర్ స్వయంగా చెప్పినట్లు సమాచారం. మరో ఆరు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను ప్రస్తుతానికి కేసీఆర్ పెండింగ్ లో పెట్టారు. ఇందులో నలుగురు సిట్టింగ్ ఎంపీలు ఉండడంతో వారిలో ఆందోళన పెరుగుతోంది. కరీంనగర్ సభ తర్వాతే పెండింగ్ సీట్లపై స్పష్టత వస్తుందని సమాచారం.
ప్రస్తుతం టీఆర్ఎస్ పెండింగ్ లో పెట్టిన ఆరు లోక్ సభ స్థానాలు ఇవేనని ప్రచారం జరుగుతోంది. నల్గొండ, ఖమ్మం, పెద్దపల్లి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, సికింద్రాబాద్ స్థానాల్లో అభ్యర్థులను కేసీఆర్ ఎంపిక చేయలేదు. ఈ ఆరు సీట్లను ఎంపిక చేసి అన్నింటిని ఒకేసారి విడుదల చేయాలని కేసీఆర్ భావిస్తున్నాడట..
*నల్గొండ బరిలో గుత్తాసుఖేందర్ రెడ్డి సీటును ఇస్తానన్నా రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన కోరుతున్నాట. దీంతో తేరా చిన్నపరెడ్డి, వి.నర్సింహారెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు.
*మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారన్న ఫిర్యాదుల మేరకు సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి అభ్యర్థిత్వంపై కేసీఆర్ పెండింగ్ లో పెట్టారు. ఇక్కడ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు.
*ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా టికెట్ కష్టమేనట.. పొంగులేటి మొన్నటి ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థులను ఓడించాడని ఫిర్యాదులొచ్చాయి. దీంతో అక్కడే మాజీ మంత్రి తుమ్మల - పారిశ్రామికవేత్త రాజేంద్ర ప్రసాద్ పేర్లను టీఆర్ ఎస్ పరిశీలిస్తోంది.
*మహబూబాబాద్ లో సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్ తోపాటు మాలోతు కవిత - రామచంద్రనాయక్ లు పేర్లు పరిశీలిస్తున్నారు.
*పెద్దపల్లిలో జి వివేకానందకు టికెట్ విషయంలో ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన మొన్నటి ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించారన్న ఫిర్యాదులొచ్చాయి. వివేకానందకు టికెట్ ఇస్తారా లేదా అన్న చర్చ సాగుతోంది.
* సికింద్రాబాద్ నుంచి మంత్రి తలసాని కుమారుడు సాయికిరణ్ యాదవ్ - బొంతు శ్రీదేవి యాదవ్ - దండె విఠల్ పేర్లు పరిశీలిస్తున్నారు.
1.మల్కాజి గిరి -కే నవీన్ రావు
2. నాగర్ కర్నూల్ -పి.రాములు
3. నిజామాబాద్ -కల్వకుంట్ల కవిత
4. ఆదిలాబాద్-గేడం నగేష్
5. కరీంనగర్ - బోయినపల్లి వినోద్ కుమార్
6. జహీరాబాద్ - బీబీ పాటిల్
7. మెదక్ - కొత్త ప్రభాకర్ రెడ్డి
8. వరంగల్ -పసునూరి దయాకర్
9. చేవెళ్ల - జి. రంజిత్ రెడ్డి
10.భువనగిరి- బూరనర్సయ్య గౌడ్

ఇప్పటివరకు టీఆర్ ఎస్ పది స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు టాక్.. వారు వీరే..
2. నాగర్ కర్నూల్ -పి.రాములు
3. నిజామాబాద్ -కల్వకుంట్ల కవిత
4. ఆదిలాబాద్-గేడం నగేష్
5. కరీంనగర్ - బోయినపల్లి వినోద్ కుమార్
6. జహీరాబాద్ - బీబీ పాటిల్
7. మెదక్ - కొత్త ప్రభాకర్ రెడ్డి
8. వరంగల్ -పసునూరి దయాకర్
9. చేవెళ్ల - జి. రంజిత్ రెడ్డి
10.భువనగిరి- బూరనర్సయ్య గౌడ్