తమది సంక్షేమ ప్రభుత్వమని.. ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చెదిరిపోకుండా ఉండేందుకు తామెంత కష్టపడుతున్న విషయాన్ని అదే పనిగా చెబుతుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఇచ్చిన హామీల్ని నెరవేర్చటమే గొప్ప అనుకునే రోజుల్లో.. ఇవ్వని హామీల్ని అమలు చేస్తున్న వైనాన్ని గొప్పగా చెప్పుకోవటం కనిపిస్తుంది. ఇలా.. చేతికి ఎముక లేనట్లుగా వరాలు ఇచ్చేసిన సారుకు రాబడి తగ్గిపోవటం.. ఖర్చు పెరిగిపోవటంతో రూపాయి కూడా వంద రూపాయిల మాదిరి కనిపిస్తుందని ఈ మధ్యన సారు నోటి నుంచి రావటం చూస్తే.. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది.
ఆర్థిక మందగమనం.. దానికి కోవిడ్ వైరస్ జత కట్టటంతో రాబడి తగ్గి పోయిన పరిస్థితి. ఇప్పటికిప్పుడు రాష్ట్ర ఆదాయం పెరగని పక్షంలో ఇబ్బందులు తప్పవన్న సంకేతాల్ని ఇప్పటికే అధికారులు ఇచ్చేసిన పరిస్థితి. గడిచిన కొన్నేళ్లుగా కరెంటు ఛార్జీలు పెంపు అన్నది లేకుండా ఉన్న వేళ.. ఛార్జీలు పెంచేందుకు వీలుగా ప్రతిపాదనల్ని సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గృహ వినియోగ ఛార్జీలు పెరుగుతాయని చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యూనిట్ కు పందొమ్మిది పైసలు లోటు ఉందని.. ప్రభుత్వ సబ్సిడీతో డిస్కమ్ లు నెట్టుకురాలేవన్న వైనాన్ని ముఖ్యమంత్రికి స్పష్టం చేయటంతో ఛార్జీల పెంపునకు ఆయన ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు. డిస్కమ్ లు వివిధ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఏకంగా రూ.13,647 కోట్ల మేర బకాయి ఉన్న విషయం సీఎం కేసీఆర్ ముందుకు వెళ్లింది.
కరెంటు ఛార్జీలను పెంచని పక్షంలో సబ్సిడీ భారం ప్రభుత్వం మీద పడనుంది. ఇప్పటికే నిధుల కొరత తో కిందామీదా పడుతున్న ప్రభుత్వం ఇప్పుడు కొత్త బరువును మోసే పరిస్థితుల్లో లేదు. దీనికి తోడు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. ఆర్థిక లోటు అదే స్థాయిలో పెరిగిపోతోంది. విద్యుత్ ఉద్యోగుల జీతాల భారం అంతకంతకూ పెరగటం.. సబ్సిడీ తోడవుతున్న వేళ.. విద్యుత్ ఛార్జీల పెంపు మినహా మరో మార్గం లేని పరిస్థితి. సో.. రానున్న కొద్ది రోజుల్లోనే విద్యుత్ భారం మోసేందుకు తెలంగాణ ప్రజలు రెఢీ అవ్వాల్సిన పరిస్థితి ఉందని చెప్పక తప్పదు.