గ్రేటర్ లో ఎన్నికల నగారా మోగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలెక్షన్స్ 2020 షెడ్యూల్ ను తెలంగాణ ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఎన్నికలను బ్యాలెట్ బాక్సుల ద్వారా నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ పాలకవర్గం పదవీ కాలం 2021 ఫిబ్రవరి 10న ముగియనుంది. 2016లో నిర్వహించిన వార్డుల ప్రకారమే ఈసారి ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధపారథి తెలిపారు. డిసెంబర్ 1వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ , తమ పార్టీ నేతలతో బుధవారం మధ్యాహ్నం 2గంటలకు టీఆర్ ఎస్ పార్లమంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగనుంది. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరగనున్న ఈ కీలక భేటీకి టీఆర్ ఎస్ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు తప్పకుండా హాజరు కావాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో కేసీఆర్ నేతలకు దిశా నిర్దేశం చేయబోతున్నారు. గత గ్రేటర్ ఎన్నికల్లో 99 వద్ద ఆగిపోయిన టిఆర్ ఎస్ , ఈసారి ఖచ్చితంగా వంద దాటాలని టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఉన్న తక్కువ సమయం ఎలా ఉపయోగించుకోవాలో నేతలకి దిశానిర్దేశం చేయనున్నారు.
గ్రేటర్ పరిధిని మొత్తం నాలుగు జోన్లుగా విభజించి మంత్రులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు 35 మంది ఎమ్మెల్సీలను ప్రచార బరిలో మోహరిస్తున్నారు. గ్రేటర్ లో ప్రచారం చేయాల్సిన సంక్షేమ,అభివృద్ది కార్యక్రమాలపై బుధవారం నాటి సమావేశంలో కేసీఆర్ నేతలకు వివరారించబోతున్నారు. అలాగే గ్రేటర్ అభ్యర్థుల తొలి జాబితాను కూడా రేపే అంటే బుధవారం విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే ఈ భేటీలోనే టీఆర్ ఎస్ గ్రేటర్ మేనిఫెస్టోను సిద్ధం చేసే అవకాశం ఉంది. ఇక ఈ ఎన్నికలపై మంత్రి తలసాని మాట్లాడుతూ ... గ్రేటర్ ఎన్నికల్లో 104 స్థానాలు సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. మా అభివృద్దే మా గెలుపుకు నాంది అని, దుబ్బాక ఫలితాలు గ్రేటర్ లో ప్రభావం చూపబోదు అని అన్నారు.