నోరు జారారా.. కావాల‌నే అన్నారా? .. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో న‌ష్టం!

Update: 2022-08-29 05:53 GMT
తెలంగాణ ప్ర‌భుత్వం ఒక‌వైపు.. త‌మ‌ది ప్ర‌జాప్ర‌భుత్వ‌మ‌ని.. ల‌బ్ధి దారులు ఎక్కడ ఉన్నా.. ఏ రూపంలో ఉన్నా.. పార్టీల‌కు.. అతీతంగా అన్నీ అందిస్తామ‌ని చెబుతోంది. అయితే.. క్షేత్ర‌స్థాయిలో కొంద‌రు నాయ‌కులు.. మాత్రం దూకుడుగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. పార్టీ జెండా మోసేవారికి.. కేసీఆర్‌ను నెత్తిన పెట్టుకునేవారికి, టీఆర్ఎస్‌కు ఓటేసేవారికి మాత్రమే ప‌థ‌కాలు అమ‌లు చేస్తామ‌ని.. బ‌హిరంగ స‌భ‌ల్లోనే వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఈ ప‌రిస్థితి రాజ‌కీయ దుమారం రేపుతోంది.

కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీష్ రావు వంటివారు.. త‌మ‌ది ప్ర‌జా ప్ర‌భుత్వ‌మ‌ని చెబుతున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయి లో ప‌ర్య‌టిస్తున్న‌వారు.. పార్టీ ప్ర‌భుత్వ‌మ‌ని అంటున్నారు. తాజాగా.. టీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లాలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. పార్టీ జెండా మోసిన వారికే సంక్షేమ పథకాలు అందుతాయని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. వీణవంకలో జరిగిన పార్టీ కార్యకర్తల సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో టీఆర్ ఎస్  పార్టీ జెండా మోసిన వాళ్లకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుం టామని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.  ఎమ్మెల్సీ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యా యి. పెద్దపల్లిలో సోమవారం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జనసమీకరణ కోసం వీణవంకలో టీఆర్ ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి.. త్వరలో కేసీఆర్ ఇండ్లు కట్టుకోవడానికి 3 లక్షలు ఇవ్వనున్నారని.. ఆ డబ్బు కేవలం టీఆర్ ఎస్‌ కార్యకర్తలకు ఇస్తారన్నారు. ఎమ్మెల్సీ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. లబ్ధిదారుల ఎంపికలో గ్రామసర్పంచ్, పార్టీ అధ్యక్షులు ఇచ్చే లిస్టే ఫైనల్ అవుతుందని స్పష్టం చేయడం కూడా సంచలనంగా మారింది.

"2 నెలల లోపల కేసీఆర్ సొంత జాగాలో ఇళ్లు కట్టుకునేవారికి 3లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. టీఆర్ఎస్ జెండా మోసిన వ్యక్తికే ఈ నిధులు అందుతాయి. వేరేవారికి ఇచ్చే ప్రసక్తే లేదు. ఆ జాబితా కూడా నేను డిసైడ్ చేయను. మీ ఊరిలో ఉన్న మన టీఆర్ఎస్ నాయకుడు ఇచ్చిన లిస్ట్లో ఉన్న పేర్లే ఫైనల్" అని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News