ఆ గుర్తును ఎవరికి ఇవ్వొద్దంటున్న టీఆర్ఎస్!

Update: 2020-11-16 14:30 GMT
దుబ్బాక ఎన్నికల ఫలితం వేళ.. ఓటమికి కారణాల్ని లోతుగా పరిశీలిస్తోంది టీఆర్ఎస్ పార్టీ. రాజకీయాల్లో గెలుపోటములు మామూలే అన్నట్లుగా సింఫుల్ గా ఇష్యూను తేల్చేసినా.. గులాబీ బాస్ మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. దుబ్బాక ఫలితం వెలువడిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. తాజాగా ఎన్నికల సంఘాన్ని కలిసి టీఆర్ఎస్ నేత వినోద్ కుమార్.. కారును పోలిన గుర్తుల్ని ఏ అభ్యర్థికి కేటాయించొద్దని కోరింది.

ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో కారు గుర్తును పోలి ఉన్న రోటీ మేకర్ కు 3500 ఓట్ల వరకు నమోదు కావటం.. ఆ గుర్తు టీఆర్ఎస్ పార్టీకి చెందిన కారు గుర్తును పోలి ఉండటం ఒక ఎత్తు అయితే.. ఉప ఎన్నికల్లో వినియోగించిన రెండు ఈవీఎంలలో.. మొదటి ఈవీఎంలలో మూడో గుర్తు కారు అయితే.. రెండో ఈవీఎంలో రోటీ మేకర్ మూడో స్థానంలో ఉండటం.. అప్పటికే ఎన్నికల ప్రచారంలో హరీశ్ లాంటి వారు.. ఈవీఎంలోని మూడో నెంబరు వద్ద నొక్కుడే నొక్కాలని చెప్పేయటం ప్రభావితం చూపింది.

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కేవలం 1118 ఓట్ల తేడాతో గెలుపొందిన నేపథ్యంలో.. రోటీ మేకర్ కు పడిన 3500 ఓట్లలో అన్నోఇన్నో టీఆర్ఎస్ కు పడి ఉంటే.. ఫలితం మరోలా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ను కలిసిన టీఆర్ఎస్ నేతలు కారును పోలిన గుర్తుల్ని ఎవరికి కేటాయించొద్దన్న వినతి చేశారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితే టీఆర్ఎస్ కు ఎదురుకావటం గమనార్హం.


Tags:    

Similar News