విభేదాల్ని పట్టించుకోవద్దు. విమర్శల్ని వదిలేద్దాం. కేవలం వాస్తవాల్ని మాత్రమే చూద్దామని ఫిక్స్ అయినప్పుడు తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండం మాష్టారి పరిస్థితి ఇలా మారిపోయిందేనన్న భావన పలువురు తెలంగాణ వాదులకు కలుగుతోంది.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిజాయితీగా పోరాటం చేసి.. తాను నమ్మిన సిద్ధాంతానికి ఏ మాత్రం రాజీ పడకుండా వ్యవహరించిన ఉద్యమనేతల్లో కోదండరాం ముందుంటారు.
తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది పాల్గొన్నారు. సగటు ఉద్యమవేత్తల్ని వదిలేసి.. అగ్ర నాయకత్వాన్ని చూస్తే.. తెలంగాణ ఉద్యమం కోసం ఆస్తుల్ని అమ్ముకున్న అతి కొద్దిమందిలో కోదండం మాష్టారు ఒకరని చెప్పక తప్పదు. ఈ విషయం ఉద్యమాన్ని దగ్గర నుంచి చూసిన చాలామందికి తెలుసు. తెలంగాణ ఆకాంక్ష మినహా మరింకే పట్టని కోదండం మాష్టారు కోరుకోవాలే కానీ.. పదవులు రావటం పెద్ద విషయం కాదు.
విధానాల పరంగా రాజీ పడకుండా ఉండటం.. పోరు చేసి కోరి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమ ఫలాలు ప్రతి తెలంగాణ బిడ్డకు అందాలని తపించే కోదండం మాష్టారిపై ఈ మధ్య కాలంలో తెలంగాణ అధికారపక్ష నేతలు విరుచుకుపడుతున్న వైఖరిని పలువురు తప్పు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు ఏర్పడిన తర్వాత రెండేళ్ల వరకూ కించిత్ విమర్శలు చేయకుండా.. వీలైనంత వరకూ సమర్థించిన విషయాన్ని టీఆర్ ఎస్ నేతలు మర్చిపోవటంపై పలువురు ఉద్యమనాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కోదండం మాష్టారి డైరెక్షణ్ లో ఎదిగిన నేతలు ఈ రోజు ఆయనపై ఒంటికాలిపై లేవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. కేసీఆర్ సర్కారును విమర్శిస్తున్నారన్న కారణంగా.. ఆయనపై చేస్తున్న విమర్శలు ఈ మధ్య మరీ శ్రుతి మించుతున్నట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏ ఉద్యోగం లేని కోదండరాం ఉద్యోగాలను కాకి ఎత్తి కెళ్లిందని చప్పటం సిగ్గుచేటని.. కోదండరాంను కాంగ్రెస్ ఎత్తుకెళ్లిపోయిందంటూ టీఆర్ ఎస్ నేతలు విమర్శించటాన్ని తప్పు పడుతున్నారు.
నిజంగా.. ఒక పార్టీకి అనుకూలంగా పని చేసే మైండ్ సెట్ కోదండం మాష్టారికి ఉండి ఉన్నపక్షంలో.. ఉద్యమంలో కలిసి నడిచిన కేసీఆర్ ను కోరితే ఆయన కాదనేవారా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఐకాసను రాజకీయ నిరుద్యోగుల శిబిరంగా కోదండం మారుస్తున్నారంటూ టీఆర్ ఎస్ నేతలు చేస్తున్న విమర్శల్ని పలువురు తప్పు పడుతున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో నడిపించి.. తెలంగాణ రావటంలో కీలకభూమిక పోషించటమే కాదు.. ఈ రోజు పదవుల్లో ఉన్న ఎందరికో రాజకీయ ఉద్యోగాలు ఇప్పించిన కోదండం మాష్టారిని అన్నేసి మాటలు అంటారా? అంటూ మండిపడుతున్నారు. పవర్ లో ఉన్న తెలంగాణ అధికారపక్ష నేతలకు ఉద్యమకారుల అభ్యంతరాలు తలకెక్కుతాయా..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/