టీఆర్ఎస్ లో 2020 ఫీవర్.. కేసీఆర్ ఏం చేస్తారు?

Update: 2020-02-21 09:35 GMT
టీఆర్ఎస్ లో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగింటిని గులాబీ దళపతి ఎవరితో భర్తీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఖాళీ స్థానాల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున సీనియర్లు, మాజీలు, ఆశావహులు ఎదురు చూస్తున్నారు. పదవుల పండుగ మొదలు కావడంతో కేసీఆర్ ఎవరికి కేటాయిస్తారన్నది నేతల్లో ఉత్కంఠ రాజేస్తోంది.

ఈ 2020 సంవత్సరంలో 4 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. గవర్నర్ కోటాలో 3 స్థానాలు, నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో మరో సీటు ఖాళీ కానుంది. దీనికి నోటీఫికేషన్ రానుండడం తో ఈ స్థానాలపై తీవ్ర పోటీ ఉంది. దాదాపు 40 మంది ఈ నాలుగు సీట్ల కోసం పోటీ పడుతుండడం టీఆర్ఎస్ లో పోటీకి నిదర్శనంగా మారింది.

ఇక ఖాళీ అయ్యే స్థానాల్లోని ఎమ్మెల్సీలు తమకు రెన్యువల్ అవుతుందో లేదోనన్న టెన్షన్ లో ఉన్నారు. మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయనకు రీసెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఆయన అల్లుడికి అడిగినా ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ కనుక ఇవ్వకపోతే నాయిని శివాలెత్తడం ఖాయం. మరో ఎమ్మెల్సీ రాములునాయక్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో సస్సెండ్ చేశారు. పార్టీ మారడంతో ఆయనకు పదవి లేనట్టే. ఇక కర్నె ప్రభాకర్ కు మరోసారి అవకాశం ఖాయం గా కనిపిస్తోంది.

ఇక నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో నేతల క్యూ భారీగా ఉంది. ఇక్కడి నుంచి సురేష్ రెడ్డిని దింపుతారని యోచిస్తున్నారు.

ఈ నాలుగు స్థానాల్లో ఒక్క కర్నె ప్రభాకర్ కు మాత్రమే కేసీఆర్ మరోసారి భరోసా ఇచ్చినట్టు తెలిసింది. మిగతా మూడు స్థానాలకు గులాబీ పార్టీలో తీవ్ర పోటీ ఉంది. కేసీఆర్ ఎవరికి పదవులు కేటాయిస్తారన్నది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News