బయటపడ్డ టీఆర్ఎస్-ఎంఐఎం ఫ్రెండ్ షిప్

Update: 2021-02-11 15:30 GMT
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌ లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.  మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలలో చివరి క్షణంలో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడానికి అఖిల భారత మజ్లిస్-ఇ-ఇట్టేహాదుల్ ముస్లిమీన్ (ఎఐఐఎంఐఎం) వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. గురువారం మరోసారి ఇరు పార్టీల మధ్య పరోక్ష సహకారం మరోసారి బహిర్గతం చేసింది.

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో మెజారిటీ మార్కును చేరుకోవడానికి కష్టపడుతున్న టీఆర్‌ఎస్, తన కో-ఆప్షన్ సభ్యులందరినీ చుట్టుముట్టినప్పటికీ, ఎంఐఎంతో రహస్య అవగాహన కుదుర్చుకోవడం వల్లే  మేయర్ పీఠం సాధించింది.. మేయర్ మరియు డిప్యూటీ మేయర్ పోస్టులను సజావుగా గెలుచుకుంది.

ఫలితంగా, బంజారా హిల్స్ డివిజన్‌కు చెందిన గద్వాల్ విజయలక్ష్మి జిహెచ్‌ఎంసి కొత్త మేయర్‌గా ఎన్నికయ్యారు, తార్నాకాకు చెందిన మోతే శ్రీలత శోభన్ రెడ్డి  డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకున్నారు, ఈ ఇద్దరు మహిళలకు మద్దతుగా ఎంఐఎం సభ్యులు చేతులు ఎత్తారు. , "సిగ్గు-సిగ్గు" మరియు "జై శ్రీ రామ్" అంటూ బీజేపీ కార్పొరేటర్ల  నినాదాల మద్యే ఈ ఎన్నిక జరిగింది.

విజయలక్ష్మి టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె కేశవ రావు కుమార్తె. ఈమె బీజేపీ తరుఫున మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన ఆర్కే పురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డిని ఓడించారు. డిప్యూటీ మేయర్ శ్రీలత బీజేపీకి చెందిన శంకర్ యాదవ్‌ను ఓడించింది.

ప్రారంభంలో ఎంఐఎం శిబిరం నుండి మేయర్ మరియు డిప్యూటీ మేయర్ పోస్టులకు అభ్యర్థులను నిలబెడుతున్నారని వార్తలు వచ్చాయి.. దీంతో బిజెపి శిబిరంలో ఒక ప్రతిష్టంభన ఏర్పడింది. టీఆర్ఎస్ -ఎంఐఎం పార్టీలు మేయర్ పదవిని గెలుచుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కానీ  ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే కొద్ది నిమిషాల ముందు ఎంఐఎం పోటీ నుండి వైదొలిగి, టిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతునిచ్చింది. దాని ఫలితంగా వారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేయర్ గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.
Tags:    

Similar News