ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి బాస్. పైగా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు. ఏ పని కావాలన్నా ప్రజాప్రతినిధులు ఆయన వద్దకు వెళ్లాల్సిందే. అలాంటి పెద్ద నేత కూతురు పెళ్లి అంటే ఆ మాత్రం హడావుడి సహజం. ఇక ఎమ్మెల్యే అడిగాడో లేదో తెలియదు కానీ.. ఆ నియోజకవర్గంలోని సర్పంచుల ఫోరం మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించింది. ఏకంగా వారి వాట్సాప్ గ్రూపులో కొందరు కీలక ఫోరం సభ్యులు డిసైడ్ అయ్యి ఒక్కొక్కరూ రూ.5వేల చొప్పున వివాహానికి కట్న కానుకలు సమర్పించాలని డిసైడ్ చేశారు. దాన్ని వాట్సాప్ లో షేర్ చేశారు. అది కాస్తా వైరల్ అయ్యింది.
ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూతురు వివాహానికి కట్న కానుకలు ఇవ్వాలని.. ప్రతి ఒక్కరూ తమ వంతు వాటాగా డబ్బులు గూగుల్/ ఫోన్ పే నంబర్ కు పంపాలంటూ ఒక మెసేజ్ రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యే కూతురు వివాహం జరుగనున్న నేపథ్యంలో సర్పంచ్ లు తమ చేయి వేసి బాసటగా నిలవాలన్నసారాంశంతో కూడిన ఒక మెసేజ్ వైరల్ అయ్యింది. దీనిపై సర్వత్రా చర్చ సాగింది.
కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూతురు వివాహం కోసం సర్పంచ్ లు ఇలా కట్నకానుకలు వసూలు చేయడంపై భిన్న వాదనలు వినిపించాయి. ఈ విషయం టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తెలియదని.. ఆయన డబ్బులు డిమాండ్ చేయలేదని.. సర్పంచ్ లే స్వతహాగా ఇలా కలెక్షన్లు చేసి ఎమ్మెల్యే కూతురు వివాహానికి కట్నం ఇవ్వాలని అనుకున్నారని తెలిసింది.
ఒక్కో సర్పంచ్ రూ.5వేల చొప్పున పంపించాలని సర్పంచుల ఫోరం కోరింది. సర్పంచ్ ల ఫోరం తీసుకున్న ఈ నిర్ణయం పాటించాలని.. గూగుల్ పే, ఫోన్ పే నుంచి ఇవ్వాలని అనుకునే ప్రతి సర్పంచ్ రూ.5వేల కంటే ఎక్కువనే పంపించొచ్చు అని ఆ మెసేజ్ లో ప్రస్తావించారు.
అయితే ఈ వ్యవహారం వైరల్ కావడంతో పలు మండలాల్లోని సర్పంచులు స్పందించారు. ఎమ్మెల్యే కూతురు వివాహానికి కానుకలు ఇచ్చే విషయం గురించి ఎలాంటి డిమాండ్, అభ్యర్థనలు పెట్టలేదని.. ఎవరైనా తోచిన విధంగా సాయం చేయాలని మాత్రమే అడిగారని తెలిపారు. తమను మాత్రం ఎవరూ అడగలేదని అన్నారు. కొన్ని మండలాల సర్పంచ్ ల ఫోరం ప్రతినిధులు మాత్రమే అత్యుత్సాహం ప్రదర్శించారని తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫోస్ట్ ఫేక్ అని.. సర్పంచ్ లను ఎవరూ రూ.5వేల చొప్పున అడగలేదని కొందరు అంటున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా కొంతమంది ఇలా పోస్టులు పెట్టి అందరినీ ఇరకాటంలో పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై నిజనిజాలు తెలియాల్సి ఉంది.