మాటలు కాదు చేతల్లో చూపించాడు.. డబ్బులు తిరిగి ఇప్పించిన ఎమ్మెల్యే దాస్యం
కరోనా వేళ కాసుల కక్కుర్తికి ప్రైవేటు ఆసుపత్రులు మాత్రమే కాదు.. ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లు తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా.. నిబంధనలు ఎన్ని తీసుకొచ్చినా తమ ధన దాహాన్ని తీర్చుకునేందుకు సామాన్యుడ్ని బలి చేస్తున్నాయి. వారి నుంచి కాసులు లాగటమే పనిగా పెట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న సామాన్యుడు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే చొరవ కారణంగా తన నుంచి వసూలు చేసిన మొత్తాన్ని వెనక్కి తీసుకునే అవకాశం కలిగింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైనం గురించి తెలిసినంతనే.. స్పందించిన ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేను పలువురు అభినందిస్తున్నారు. ఇంతకూ అసలేం జరిగిందంటే..
వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు స్థానిక విజయ డయాగ్నస్టిక్ సెంటర్లో సిటీస్కాన్ కు రూ.5వేలు వసూలు చేసినట్లుగా సమాచారం అందింది. నిబంధనల ప్రకారం రూ.2500 మాత్రమే తీసుకోవాల్సి ఉంది. అందుకు భిన్నంగా ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసినట్లుగా తెలుసుకొని పోలీసులు.. అధికారుల్ని వెంట పెట్టుకొని వెళ్లారు. ప్రభుత్వం నిర్ణయించిన మొత్తానికి భిన్నంగా అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేయటం సరికాదని చెప్పటమే కాదు.. ఇలాంటి అనుభవాలు ఎదురైతే 9849766789 నెంబరును సంప్రదించాలని కోరారు.
నిబంధనల ప్రకారం సిటీ స్కాన్ కోసం వెళితే రూ.2వేలు మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ.. ఫిల్మ్ కూడా కావాలని పేషెంట్ అడిగితే మరోరూ.500 అదనంగా తీసుకునే వీలుంది. కానీ.. కరోనా నేపథ్యంలో సిటీ స్కాన్ లకు పెరిగిన డిమాండ్ ను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న సెంటర్లు.. భారీగా వసూళ్లకుపాల్పడుతున్నాయి. అధికంగా వసూలు చేస్తున్నారన్న విషయం తెలిసినంతనే పట్టనట్లు ఉండకుండా స్పందించిన ఎమ్మెల్యే దాస్యం తీరును పలువురు అభినందిస్తున్నారు.