అతి చేస్తే ఎవరైనా సరే ఊరుకునేది లేదు.. తోక కత్తిరిస్తానంటూ వార్నింగ్ ఇస్తుంటారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మీరేం చేసినా నాకు రావాల్సిన రిపోర్టులు వచ్చేస్తుంటాయని ఆయన నోటి నుంచి తరచూ ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. మరి.. అలాంటి ముఖ్యమంత్రి ఉన్నవేళ.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తారని అనుకుంటాం. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ.. తరచూ వివాదాల్లోకి చిక్కుకుంటున్నారు గులాబీ ఎమ్మెల్యేలు. తాజాగా అలాంటి పరిస్థితే చోటు చేసుకుంది.
మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యహనుమంతరావు తరచూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తుంటారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న వేళలో.. అధికారపార్టీ నేతలంతా అప్రమత్తంగా ఉంటే.. అనవసరమైన చిక్కుల్లో చిక్కుకోకుండా ఉండే వీలుంది. కానీ.. మైనంపల్లికి కోపం వచ్చినా ఆవేశం వచ్చినా.. చివరకు ప్రేమ వచ్చినా దాన్ని తట్టుకోవటం అంత తేలికైన విషయం కాదు. తాజాగా దూలపల్లి నుంచి ఒక వాహనం కొంపల్లి వైపు రాంగ్ రూట్ లోకి వచ్చింది. అక్కడే ఉన్న ట్రాఫిక్ ఎస్ వాహనాన్ని నిలిపాడు.
వివరాలు అడిగితే తాను ఎమ్మెల్యే మైనంపల్లి మనిషినని.. తననే అడ్డుకుంటారా? అంటూ హడావుడి చేశారు. నువ్వు ఎవరైతే నాకేంటి? ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ట్రాఫిక్ చలానా వేశారు. ఎంత ఎమ్మెల్యే మనిషివైతే మాత్రం రూల్స్ బ్రేక్ చేస్తానంటూ హితవు పలికారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన డ్రైవర్ వెంటనే మైనంపల్లికి ఫోన్ చేశారు. దీంతో,.. ఎమ్మెల్యే హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. విషయంతెలిసినంతనే తన ఫాలోయర్ అయిన ఆటోవాలాను తిట్టాల్సిన ఆయన.. అందుకు భిన్నంగా ఎస్ఐపై విరుచుకుపడ్డారు.
నా అనుచరుడని చెప్పిన తర్వాత విడిచి పెట్టవా? అంటూ ఫైర్ అయ్యారు. దుర్భాషలాడారు. దీన్నివీడియో తీసేందుకు ప్రయత్నించగా.. ఎస్ఐ చేతిలోని ఫోన్ ను లాక్కొని విసిరికొట్టారు. అనంతరం ఇరువురి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అధికార పార్టీ నేతనే గౌరవించరా? అంటూ రోడ్డు మీదనే ఆయన బైఠాంచారు. దీంతో.. ఇష్యూ మరింత పెద్దగా మారింది. ఈ క్రమంలోఉన్న పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి సర్ది చెప్పారు. ఎమ్మెల్యే తీరు బాగోలేదన్న మాట పోలీసు వర్గాల్లో వినిపిస్తుంటే.. ఇలాంటివి అధికార పార్టీ నేతలకు ఏ మాత్రం సరికావని పోలీసులు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల వరకు వెళ్లినట్లు తెలుస్తోంద. ఇలాంటివి మొదట్లోనే తుంచేయాలని.. లేదంటేప్రజల్లో చులకన అవుతామన్న మాట వినిపిస్తోంది. మరి.. ఉన్నతాధికారులు ఏం చేస్తారో చూడాలన్న మాట పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది.