టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నం..? నోట్ల కట్టలతో పట్టుబడ్డ వ్యక్తులు?
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ శివారు మొయినాబాద్ లోని ఓ ఫాంహౌస్ లో నలుగురు వ్యక్తులు భారీగా నగదుతో పట్టుబడ్డారు. రామచంద్రభారతి, సోమయాజులు స్వామి, తిరుపతి,నందకుమార్లను పోలీసులు పూర్తి సాక్ష్యాలతో పట్టుకున్నారు.
మునుగోడులో ఫిరాయింపుల కోసం ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కట్ర పన్నినట్టు సమాచారం. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరం జరుపుతుండగా పోలీసులు దాడులు జరిపారు. రూ.15 కోట్ల వరకూ నగదు దొరికినట్లు సమాచారం.
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఇచ్చేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వీరు రంగంలోకి దిగారనే పక్కా సమాచారంతో పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
రెండు రోజులుగా ఈ నలుగురూ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుగుతున్న సమయంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. దీనిపై కాసేపట్లోనే సైబరాబాద్ పోలీసులు అధికారిక ప్రకటన చేస్తారు.
ఇందులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రమేయం ఉందా?వారు కొనుగోలుకు అమ్ముడుపోయారా? అన్న విషయాలు తేలాల్సి ఉంది. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.