తెలంగాణలో చీమ చిటుక్కుమన్నా కేసీఆర్ కు తెలుస్తుంది. ఎక్కడో ఢిల్లీ నుంచి బీజేపీ ఏజెంట్లు వచ్చి తెలంగాణ గల్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొంటుంటే పట్టేసుకున్నాడు. ఇక అధికార టీఆర్ఎస్ లోనే ఉంటూ కూటమి కడితే ఒప్పుకుంటాడా? అన్నది ప్రశ్న.
అయితే పైకి అభివృద్ధి పనులు అని చెబుతున్నా.. లోపల మాత్రం అసంతృప్తి సెగ అని పొగ వస్తోంది. కడుపు కాలిన వాసన వస్తోంది. అధికార టీఆర్ఎస్ లో అసమ్మతి జ్వాల ఇప్పుడు మెల్లిగా అంటుకున్నట్టే కనపడుతోంది.
రెండు సార్లు గెలిచిన అసమ్మతి.. ముచ్చటగా మూడోసారి గెలుపు సులువు కాదన్న అంచనాలు.. అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉంటే గెలవమన్న సంకేతాలు.. ఇక టికెట్ దక్కుతుందో లేదోనన్న భయాలు.. ఓవైపు బీజేపీ తరుముకొస్తున్న వేళ హైదరాబాద్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో జరిగిన ఈ భేటికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గ సమస్యలపైనే భేటి అని ఆయా నేతలు చెబుతుండగా.. ఓ మంత్రికి వ్యతిరేకంగా వీరంతా భేటి అయినట్టు ప్రచారం సాగుతోంది.
మల్కాజిగిరి జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి ఆ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలకు అస్సలు పడదు. దొడ్డిదారిన మంత్రి అయిపోయి తమపై పెత్తనం చెల్లాయిస్తున్న మల్లారెడ్డిపై ఈ అసమ్మతి ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అందుకే ఈ హైదరాబాద్ శివారు ఎమ్మెల్యేలంతా కలిసి చర్చలు జరుపుతున్నారని.. వీరంతా కాంగ్రెస్ లోకి టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురితో మాట్లాడారని.. వచ్చేసారి టికెట్లు ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ లోకి జంప్ చేయడానికి అభ్యంతరం లేదని చెప్పినట్టు సమాచారం. మరి ఈ ఆఫర్ కేసీఆర్ కు తెలిసిందా? తెలిస్తే ఊరుకుంటాడా? నిజంగానే వీళ్లు కాంగ్రెస్ లోకి వెళుతున్నారా? అన్న దానిపై ప్రస్తుతం అయితే వివరాలు బయటపడడం లేదు. అంతా గోప్యంగా సాగుతోంది. చూస్తుంటే అధికార పార్టీలో అలజడులు మొదలైనట్టే కనిపిస్తోంది. ఇన్నాళ్లు కూడుకట్టుకొని ఉన్నదంతా కక్కేసేలా ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.