ఎందుకీ ఆలస్యం...గులాబి దండు నైరాశ్యం

Update: 2019-01-16 04:39 GMT
తెలంగాణ ముందస్తు ఎన్నికలు ముగిసి నెల పైనే అయ్యింది. ముఖ్యమంత్రి - హోంమంత్రి మినహా మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేయలేదు. బుధవారం నాడు శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. స్పీకర్ ఎన్నిక గాని - మంత్రి వర్గం గాని తేడాలేదు. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యులలో రోజు రోజుకీ నైరాశ్యం పెరుగుతోంది. నూతన సంవత్సరం కానుకగా మంత్రి వర్గ విస్తరణ అని ఒకసారి - సంక్రాంతి పండుగ కానుకగా అని మరోకసారి వార్తలు వచ్చాయి.  అయితే మంత్రివర్గం మాత్రం తేలలేదు. రాష్ట్రంలో పాలన స్తంభించిందంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయినా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఏమి పట్టనట్లు వ్యవహరించడం రాజకీయా - అధికార వర్గాలలో ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన కుమారుడు కె. తారాక రామారావును పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. ఆ ఒక్కటి మినహా మరే ఇతర పదవి భర్తీ కాలేదు.

ఇలా మంత్రి వర్గ విస్తరణ - కార్పొరేషన్ చైర్మన్ పదవులు భర్తీ కాకపోవడం పార్టీ నాయకులలో ఆందోళన కలిగిస్తోంది. అప్పుడూ - ఇప్పుడూ అంటూ వార్తలు వస్తున్నాయే తప్పా ఏదీ కార్యరూపం దాల్చకపోవడం పార్టీ వర్గాలలో ఆందోళన కలిగిస్తోంది. జాతీయాస్దాయిలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలతో కలసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇది పూర్తయ్యే వరకూ తెలంగాణలో ఎలాంటి పదవుల పంపకాలు ఉండవా అని పార్టీ శ్రేణులలో అనుమానాలు వస్తున్నాయి.  లోక్‌ సభ ఎన్నికలు ముగిసే వరకూ మంత్రివర్గ విస్తరణ ఉండదంటూ వార్తాలు వస్తున్నాయి. ఇదీ కూడా పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది. లోక్‌ సభ ఎన్నికలు మరో నాలుగు నెలల వరకూ జరగవు అంటే తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నాయకులందరూ మరో నాలుగు నెలల పాటు రాజకీయ నిరుద్యోగులుగా ఉండాల్సిందేనా అని ప్రశ్నిస్తున్నారు.
Tags:    

Similar News