టెక్నాలజీ మారింది. అందుకు తగ్గట్లు ఆప్డేట్ కావాల్సిన అవసరం ప్రముఖులకు ఉంది. తప్పు లేకున్నా.. బద్నాం చేసినా.. ఆచితూచి అడుగులు వేయాలి. ఏ మాత్రం తేడా జరిగినా.. అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోయిన నేతలంతా తరచూ వివాదాల్లో చిక్కుకుంటుంటారు. తాజాగా అలాంటి ఇబ్బందికర పరిస్థితినే ఎదుర్కొంటున్నారు టిఆర్ఎస్ ఢిల్లీ అధికార ప్రతినిధి మందా జగన్నాధం.
ఆయన వాయిస్ క్లిప్ గా చెబుతున్న ఒక ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. రాయలేని బూతులు తిట్టిన గొంతు మాజి ఎంపీ టిఆర్ఎస్ ఢిల్లీ అధికార ప్రతినిధి మందాదిగా చెబుతున్నారు. ఆయనకు ఎందుకింత కోపం వచ్చిందన్న విషయంలోకి వెళితే.. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ ఒక దినపత్రిక (ఈ మధ్యనే మార్కెట్లోకి వచ్చింది) భారీ ఎత్తున రాసింది. అది కూడా విలేకరి పేరుతో సహా.
దీంతో.. మందాకు చిర్రెత్తుకొచ్చినట్లుంది. సదరు విలేకరికి ఫోన్ చేసిన ఆయన.. రాయలేని పదాల్ని వాడుతూ.. సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు టిఆర్ఎస్ ఢిల్లీ అధికార ప్రతినిధి ఇచ్చి గౌరవించారని.. ఢిల్లీలో గౌరవనీయమైన స్థానం ఇచ్చారని.. అలాంటప్పుడు తాను పార్టీ మారాల్సిన ఖర్మ ఏమొచ్చిందంటూ ఆయన చెలరేగిపోయారు. ఈ సందర్భంగా అవసరం లేని అనవసరమైన మాటల్ని చాలానే అనేశారు. ఇలాంటి పరిస్థితిని ముందుగానే ఊహించారేమో కానీ.. సదరు విలేకరి ఫుల్ అలెర్ట్ గా ఉండి.. మందా కాల్ ను రికార్డు చేసినట్లుగా చెబుతున్నారు. తనను డ్యామేజ్ చేసేలా ఒక ఆర్టికల్ రాసిన విలేకరిపై అంతలా నోరు పారేసుకొని అడ్డంగా బుక్ అయ్యే కంటే.. పట్టించుకోనట్లుగా ఉంటే ఇప్పుడాయన సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వారు కాదన్న మాట వినిపిస్తోంది.
ప్రముఖమైన స్థానాల్లో ఉండే వారిని ఎవరో ఒకరు గిల్లుతుంటారు. అలా అని ప్రతి గిల్లిన దానికి చెలరేగిపోయే కన్నా.. కాస్త ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తే బాగుండేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఇంతకీ.. సదరు వాయిస్ క్లిప్ తనదేనా? కాదా? అన్న విషయంపై మందా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.