అరకును దాటేసిన మహబూబ్ నగర్

Update: 2016-10-12 08:20 GMT
 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం భారత్ దేశంలోనే అరకు పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గం మొత్తం నాలుగు జిల్లల్లో విస్తరించి ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నుంచి మొదలు పెడితే తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వరకు ఇది విస్తరించి ఉంది. శ్రీకాకుళం - విజయనగరం - విశాఖ - తూర్పుగోదావరి జిల్లాల్లో అరకు నియోజకవర్గం ఉంది. మొత్తం నాలుగు జిల్లాల్లో ఉన్న ఈ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ మొత్తం నాలుగు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించేవారు. నాలుగుజిల్లాల జడ్పీ సమావేశాలకు హాజరవ్వాల్సి ఉంటుంది. అఫ్ కోర్సు.. ప్రస్తుత అరకు ఎంపీ కొత్తపల్లి గీత అసలు నియోజకవర్గ కేంద్రంలోనే కనిపించరు కాబట్టి ఆమెకు జడ్పీ సమావేశాలకు వెళ్లే పనిలేదు. ఇదంతా ఎలా ఉన్నా ఇప్పుడు అరకు రికార్డును తెలంగాణలోని మహబూబ్ నగర్ ఎంపీ నియోజకవర్గం బద్దలు కొడుతోంది.  తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మహబూబ్ నగర్ నియోజకవర్గం మొత్తం 8 జిల్లాల్లో విస్తరిస్తోంది. దేశంలో ఇంకే పార్లమెంటు నియోజకవర్గం కూడా ఇన్ని జిల్లాల్లో విస్తరించిలేదు.

దీంతో మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి 8 జిల్లాల్లో రాజకీయం చేస్తారన్న మాట. అంతేకాదు.. 8 జిల్లాల జడ్పీ సమావేశాలకు ఆయన అటెండ్ కావాల్సి ఉంటుంది.  

మహబూబ్ నగర్ పార్లమెంట్‌ నియోజకవర్గానికి చెందిన మండలాలు కొత్తగా వనపర్తి - నాగర్‌ కర్నూలు  - వికారాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌ నగర్ ఇలా మొత్తం ఎనిమిది జిల్లాల పరిధిలోకి వెళ్లిపోయాయి. దీంతో ఏమాత్రం శాస్త్రీయత లేకుండా జిల్లాలను విభజించారని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News