తెలంగాణ‌లో..మోదీ గ్రాఫ్ ఇంత‌గా ప‌డిపోయిందా?

Update: 2018-02-02 11:53 GMT
టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం త‌న‌య‌ - నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత... ఏ విష‌యంపై అయినా క్లిస్ట‌ర్ క్లియ‌ర్‌ గానే మాట్లాడ‌తార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే... పాలిటిక్స్ లోకి కాస్తంత లేటుగానే వ‌చ్చినా... లేటెస్ట్ తానేన‌న్న‌ట్లుగా ఏ అంశంపై అయినా ఆమె సంపూర్ణ అవ‌గాహ‌న‌తోనే రంగంలోకి దిగుతారు. ముందుగా తెలంగాణ జాగృతి సంస్థ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షురాలిగా... తెలంగాణ పండుగ బ‌తుక‌మ్మను విశ్వ‌వ్యాప్తం చేయ‌డంలో ఆమె గ్రాండ్ స‌క్సెస్ అయ్యార‌నే చెప్పాలి. మొత్తంగా క‌విత ఎంట్రీ ఇచ్చాకే బ‌తుక‌మ్మ‌కు ఇప్పుడున్న స్థాయి ప్ర‌చారం ద‌క్కింద‌న‌డంలో ఏ ఒక్క‌రికి కూడా సందేహం లేదన్న మాటే వినిపిస్తోంది. క‌విత స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థ పుణ్య‌మా అని బ‌తుక‌మ్మ వేడుక‌ల‌కు ప్ర‌భుత్వాలు నిధులు విడుద‌ల చేసే కొత్త సంస్కృతికి తొలి అడుగు ప‌డింది. తెలంగాణ సంస్కృతిని ప‌రిర‌క్షించే విష‌యంలో ఏమాత్రం రాజీలేని ధోర‌ణితో ముందుకు సాగుతున్న క‌విత‌.. గ‌డ‌చిన ఎన్నికల్లో నిజామాబాదు లోక్ స‌భ స్థానం నుంచి బ‌రిలోకి దిగి బంప‌ర్ మెజారిటీతో విజ‌యం సాదించి పార్ల‌మెంటులో అడుగు పెట్టారు.

ఆ త‌ర్వాత మ‌హిళా సాధికార‌త‌ - తెలంగాణ స‌మ‌స్య‌ల‌పై త‌న‌దైన శైలిలో వాణిని వినిపిస్తున్న క‌విత‌... జాతీయ స్థాయి నేత‌ల దృష్టిలో ప‌డిపోయారు. ఆంగ్లంతో పాటు అచ్చ తెలంగాణ యాస‌లో అన‌ర్గ‌ళంగా మాట్లాడే క‌విత‌... త‌న ప్ర‌సంగంతో ప్ర‌తి అక్క‌రినీ ఆక‌ట్టుకుంటున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అస‌లు క‌విత మైకందుకుందంటే... పార్ల‌మెంటు స‌భ్యులు చెవులు రిక్కించి... సైలెంట్ ఆమె మాట్లాడే ప్ర‌తి అంశాన్ని ఆసక్తిగా వింటున్న విష‌యం కూడా మ‌న‌కు తెలిసిందే. అయినా ఇప్పుడు క‌విత గురించి ఇంత‌గా పొగ‌డాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌న్న విష‌యానికి వ‌స్తే... ఇవేమీ పొగ‌డ్త‌లు కాకున్నా... ఆమె గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించుకోవాల్సిన సంద‌ర్భ‌మైతే వ‌చ్చేసింది. నేటి మ‌ధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా టీఆర్ ఎస్ ప్ర‌స్థానంతో పాటు జాతీయ రాజ‌కీయాల‌పై కాస్తంత సుదీర్ఘంగానే మాట్లాడిన క‌విత‌... జాతీయ రాజ‌కీయాల‌పైనే కాకుండా... జాతీయ రాజ‌కీయాల్లో టీఆర్ ఎస్ పాత్ర‌ - ప్ర‌స్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న న‌రేంద్ర మోదీ స‌ర్కారు భ‌విష్య‌త్తు - వ‌చ్చే ఎన్నికల్లో ఫ‌లితాలు ఎలా ఉంటాయి? ఆ ఎన్నిక‌ల త‌ర్వాత ఏర్పాట‌య్యే ప్ర‌భుత్వాల‌కు టీఆర్ ఎస్ ఎంత కీల‌కం? అస‌లు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై జ‌నాల్లో ఎలాంటి భావ‌న ఉంది? గ‌తంలో మోదీ మేనియా న‌డిచినా... ఇప్పుడు మోదీ గ్రాఫ్ ఎలా ఉంది? ఆ గ్రాఫ్ ఇప్పుడు ఏ స్థాయికి పడిపోయింది? అన్న విష‌యాల‌ను ప్ర‌స్తావించిన క‌విత‌. ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు.

గుజ‌రాత్‌ లో నిన్న వెలువ‌డిన ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ఆస‌రా చేసుకుని క‌విత చేసిన ఈ కామెంట్లు నిజంగానే ఆసక్తిగానే ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయినా క‌విత ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... *రాజస్థాన్ లో జరిగిన ఉపఎన్నికలలో బీజేపీ ఓడిపోవడం అనేది ఆశ్చర్యం ఏమి కాదని ముందే ఊహించాం. తెలంగాణాలో బీజేపీ వీక్ అయినా... ఇదివరకటి సర్వేలలో 15-20% మోడీ ప్రధాని కావాలని కోరుకునేవారు. ఈ మధ్య నిర్వహించిన సర్వేలలో అది 5% కు పడిపోయింది. మోడీ గ్రాఫ్ తొందరగా పడిపోతుంది. అదే సమయంలో 2019లో కేంద్రంలో ఎవరు అధికారంలోకి రావాలన్నా టీఆర్ ఎస్‌ మద్దతు లేకుండా కుదరదు. మరోవైపు నిన్నటి బడ్జెట్ లో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా…ఖాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ…బయ్యారంలో ఉక్కు కర్మాగారం…ఐఐఎం… ఎయిమ్స్‌….పసుపు బోర్డుల‌ను ప్ర‌స్తావించినా... మరిన్ని వరాలివ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ విన్నపాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. బడ్జెట్‌లో ఒక్క ప్రాజెక్టుగానీ - మంజూరు గానీ రాష్ట్రానికి దక్కకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తికి లోనయింది* అని క‌విత త‌న‌దైన శైలిలో విశ్లేష‌ణ చేశారు. మొత్తంగా మోదీ గ్రాఫ్ క్ర‌మంగానే కాకుండా చాలా స్పీడుగా ప‌డిపోతోంద‌ని క‌విత చెప్ప‌క‌నే చెప్పేశారు. అంతేకాకుండా కేంద్రంలో త‌దుప‌రి ప్ర‌భుత్వం త‌మ పార్టీ మ‌ద్ద‌తు లేకుండా ఏర్పాటు కావడం సాధ్యం కాద‌ని చెప్పిన క‌విత‌... జాతీయ రాజ‌కీయాల్లో టీఆర్ ఎస్ మ‌రింత కీల‌క భూమిక పోషించ‌నుంద‌న్న మాట‌ను వినిపించారు.

Tags:    

Similar News