తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ - టీఆర్ ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అనూహ్య వార్తతో తెరమీదకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ ఓ వైపు సాగుతుండగానే..మరోవైపు ఆమె సంచలన క్లారిటీ ఇచ్చారు. చాలా కాలంగా 2019 ఎన్నికల్లో కవిత స్థానంపై ప్రజల్లో అత్యంత ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశ రాజకీయాల వైపు చూస్తుంటే… తర్వాత రాష్ట్ర రాజకీయాలను అంతలా ప్రభావితం చేయగలవారు ఎవరు అనే చర్చ సాగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ స్థానాన్ని కేటీఆర్? లేదా కవిత భర్తీ చేస్తారా? అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ విషయంపై తాజాగా ఎంపీ కవిత స్పందిస్తూ పార్టీదే తుదినిర్ణయమని ఆమె స్పష్టం చేశారు. రాబోవు ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే ఎమ్మెల్యేగా.. ఎంపీగా పోటీచేయమంటే మళ్లీ ఎంపీగానే పోటీచేస్తానని వివరణ ఇచ్చారు.
వాస్తవానికి టీఆర్ ఎస్ ఎంపీ కవిత రాజకీయ భవిష్యత్ పై ఇటు పార్టీలో అటు ఆమె సన్నిహిత వర్గాల్లో గత కొద్దికాలంగా చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేస్తారా? లేదా మళ్లీ ఎంపీగానే పోటీచేస్తారా? అని గత పార్టీ శ్రేణులు కూడా ఆరాతీస్తున్నాయి. ఈ విషయంపై కవిత స్వయంగా వెళ్లడించారు. పార్టీ అధిష్టానం ఆదేశాలు మేరకు తాను ఎమ్మెల్యేగా అయినా ఎంపీగా అయినా పోటీ చేసేందుకు సిద్ధమని ఎంపీ కవిత వెల్లడించారు. కాగా, కొద్దికాలంగా తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీ కవిత తరచుగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కవిత పోటీ చేయనున్నట్లు చెప్తున్నారు. జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీచేస్తారనే అంశంపై కూడా కవిత స్పందిస్తూ ఆ విషయం తన చేతిలో లేదని ఎంపీ కవిత క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలపై ఆధారపడి ఉంటుందని వివరించారు.