లోట‌ర్ పాండ్‌ లో టీఆర్ ఎస్ ఎంపీ క‌విత‌

Update: 2015-10-01 15:43 GMT
రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల కవిత గురువారం లోటస్ పాండ్‌ లోని జగన్ ఇంటికి వెళ్లారు. సుమారు గంట‌సేపు ఆమె అక్క‌డే ఉన్నారు. క‌విత వైకాపా అధినేత జ‌గ‌న్‌ తో పాటు ఆయ‌న భార్య భార‌తి తో చాలా సేపు మాట్లాడారు. వీరిద్ద‌రి భేటీ చాలా సీక్రెట్‌ గా ఉంచారు. వీరి మ‌ధ్య అంత‌ర్గ‌తంగా ఏం చ‌ర్చ‌లు జ‌రిగాయి అన్న‌వి తెలియ‌క‌పోయినా క‌విత తెలంగాణలో జరిగే బతుకమ్మ వేడుకలకు వైఎస్ భారతిని ఆహ్వానించార‌ని..ఈ వేడుక‌ల్లో పాల్గొనేందుకు భార‌తి అంగీక‌రించార‌ని తెలుస్తోంది.

వైకాపా - టీఆర్ ఎస్ రాజ‌కీయంగా శ‌త్రువులే అయినా వీరి మ‌ధ్య అంత‌ర్గ‌తం గా మంచి సంబంధాలే ఉన్నాయ‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. వీరిద్ద‌రికి బ‌ద్ధ శ‌త్రువు అయిన టీడీపీని టార్గెట్‌ గా చేసుకుని వైకాపా - టీఆర్ ఎస్ తెర‌చాటు రాజ‌కీయాలు చేశాయ‌ని చాలాసార్లు టీడీపీ నుంచి విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన్నాయి. తెలంగాణ‌ లో వైకాపా త‌ర‌పున గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇద్ద‌రు టీఆర్ ఎస్‌ లోకి జంప్ అయ్యారు. తెలంగాణ‌లో వైకాపా బాధ్య‌త‌లు జ‌గ‌న్ త‌న సోద‌రి ష‌ర్మిల‌కు అప్ప‌గించారు. ఇదంతా జ‌గ‌న్ వ్యూహంలో భాగంగానే చేశార‌న్న ప్రచారం కూడా జ‌రిగింది. ఓటుకు నోటు విష‌యంలో కూడా ఈ రెండు పార్టీలు క‌లిసి ప‌నిచేశాయ‌న్న టాక్ వినిపించింది.

తెలంగాణ వైకాపా నేత‌లు టీఆర్ఎస్ ప్రభుత్వం పై విమ‌ర్శ‌లు చేసినా కేసీఆర్ ఫ్యామిలీ స‌భ్యులెవ్వ‌రు జ‌గ‌న్‌ పై విమ‌ర్శ‌లు గుప్పించ‌లేదు. మంత్రి హ‌రీష్‌ రావు మాత్రం వైకాపాను తెలంగాణ‌లో అస‌లు  పార్టీగానే గుర్తించ‌డం లేద‌ని విమ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో ఎంపీ క‌విత‌ ఏకంగా జగన్ ఇంటికి వెళ్లడం రాజకీయాల్లో ఆసక్తిక‌ర పరిణామంగా చెప్పుకోవచ్చు.
Tags:    

Similar News