అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన క‌విత

Update: 2018-11-15 13:42 GMT
తెలంగాణ‌లో ఎన్నో ఎన్నిక‌ల సిత్రాలు. అలాంటి ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న నిజామాబాద్‌లో జ‌రిగింది. క‌ల్వ‌కుంట కేసీఆర్‌కు త‌గ్గ వార‌సులు కేటీఆర్‌ - క‌విత‌. ఆ ఇద్ద‌రు తండ్రికి మించి జ‌నాల్ని అల‌రిస్తూ ఉంటారు. మీడియా వెంట ప‌డ‌రు. నిత్యం మీడియానే వారి ప‌డేలా ఉంటాయి వారి చ‌ర్య‌లు - మాట‌లు. తాజాగా ఈరోజు నామినేష‌న్ల కార్య‌క్ర‌మంలో నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం నుంచి టీఆర్‌ ఎస్‌ తరపున గణేష్‌ గుప్తా నామినేష‌న్ వేశారు. ఈ సంద‌ర్భంగా క‌విత సంద‌డి చేశారు.

గణేష్‌ గుప్తా కు మ‌ద్ద‌తుగా టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింప‌డానికి క‌విత వ‌చ్చారు. ఈ  సంద‌ర్భంగా ఎంపీ కవిత స్వయంగా టీఆర్ ఎస్ గుర్తు అయిన గులాబీ రంగు అంబాసిడ‌ర్‌ కారులో అభ్య‌ర్థిని ఎక్కించుకుని త‌నే గ‌ణేష్ గుప్తా ఇంటి నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ఆమే కారు న‌డిపారు. అక్క‌డి అంద‌రినీ క‌ల‌సి మాట్లాడారు.

అనంత‌రం కార్యకర్తలు - అభిమానులు - పార్టీ అభ్యర్థులతో కలిసి స‌ర‌దాగా మాట్లాడుతూ న‌డుచుకుంటూ ఆమె  తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఆమెతో పాటు ఉన్న‌ మాజీ స్పీకర్‌ సురేష్‌ రెడ్డి సమక్షంలో నిజామాబాద్‌ అర్బన్‌ నియోజక వర్గ అభ్యర్థిగా గణేష్‌ గుప్తా - ఆర్మూర్‌ నియోజకవర్గ అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్‌ రెడ్డి నామినేషన్లు వేశారు. ప్ర‌జ‌ల్లో ఎలా నిల‌వారో కేసీఆర్ సంతానానికి ప్ర‌త్యేకంగా నేర్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. జీన్స్ లో ఉందేమో అది.
   

Tags:    

Similar News